English   

రణరంగం సినిమాకు ప్రభాస్ సపోర్ట్.. శర్వా డార్లింగ్ అంటూ ట్వీట్..

Prabhas
2019-08-06 17:23:03

ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ చిత్ర ప్రమోషన్ కోసమే తన టైం అంతా కేటాయిస్తున్నాడు. ఈ గ్యాప్ లో తన స్నేహితుడు శర్వానంద్ నటించిన రణరంగం సినిమాకు ప్రమోషన్ చేసి పెడుతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఈ చిత్ర ట్రైలర్ ఈ మధ్య విడుదలైంది. సుదీర్ వర్మ తెరకెక్కిస్తున్న రణరంగం ఆగస్టు 15న విడుదల కానుంది. కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ మాఫియా డాన్ పాత్రలో కనిపిస్తున్నాడు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కేశవ సినిమా తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకొని సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో చాలా విషయాలు చూపించాడు సుధీర్ వర్మ. ఇక ఈ సినిమాకు ఇండస్ట్రీ నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది. దానికి తోడు శర్వానంద్ కు స్టార్ హీరోలు స్నేహితులు కావడంతో వాళ్లే ఈ చిత్ర ప్రమోషన్ ను భుజాన వేసుకుంటున్నారు. తాజాగా ట్రైలర్ చూసిన ప్రభాస్ అద్భుతంగా ఉంది అంటూ కితాబిచ్చాడు. ఆల్ ద బెస్ట్ శర్వా డార్లింగ్ అంటూ ట్వీట్ చేసాడు ప్రభాస్. ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ముందు సాహో విడుదల చేయాలనుకున్న ఆగస్టు 15న ఇప్పుడు రణరంగం సినిమా విడుదలవుతుంది. అది రాదు అని తెలుసుకున్న వెంటనే ఇది వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు శర్వానంద్. దానికి తోడు గతంలో ఈయన ప్రభాస్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. దాన్ని ఇప్పుడు తన సినిమా కోసం వాడుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. కచ్చితంగా రణరంగం సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతానని ధీమాగా చెబుతున్నారు శర్వానంద్. పడి పడి లేచే మనసు సినిమా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఈయన హిట్ కొట్టడం అనివార్యంగా మారింది. మరి ఈ సినిమాతో శర్వానంద్ ఎలాంటి మాయ చేస్తాడనేది చూడాలి.

More Related Stories