English   

చిరంజీవి విషయంలో ఏడుగురి పాత్ర కీలకం..

chiru
2019-08-06 19:34:21

మెగాస్టార్ చిరంజీవి స్థాయి ఏంటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రాజకీయాల్లో రాణించలేక పోయినా కూడా మళ్ళీ తిరిగి సినిమా రంగంలోకి వచ్చి ఇక్కడ సత్తా చూపిస్తున్నాడు. 64 ఏళ్ల వయసులో కూడా అభిమానుల కోసం కష్టపడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కొత్త లుక్ కూడా ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తుంది. బి పాజిటివ్ అనే మ్యాగజైన్ కోసం ఈ ఫోటో షూట్ చేసిన చిరంజీవి అందులో కొన్ని పాజిటివ్ విషయాలు కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు. ముఖ్యంగా ఈయన ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం కొందరున్నారు. చిరంజీవి అప్పట్లో షూటింగ్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే తల్లి అంజనీ దేవి, తండ్రి వెంకట్రావు ఆయన కాళ్లు పట్టేవారిని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సురేఖ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి క్షణం ప్రతి నిమిషం తన గురించి ఆమె తపన పడిందని గుర్తు చేసుకున్నాడు మెగాస్టార్. తను సినిమాలతో బిజీగా ఉంటే పిల్లలను పెంచడం వాళ్ళ అభివృద్ధి అన్నీ ఆమె చేసుకుంది అంటూ ఎమోషనల్ అయ్యాడు అన్నయ్య. ఆ తర్వాత చిరంజీవి కెరీర్ లో మరో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అల్లు అరవింద్. ఆయన కూడా చిరంజీవి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవహారాలు చూసుకొని బావకు చేదోడువాదోడుగా ఉన్నాడు. తన కెరీర్ లో అల్లు అరవింద్ పాత్ర గురించి కూడా చెప్పుకొచ్చాడు చిరంజీవి. ఆయన లేకపోతే ఈరోజు చిరంజీవి స్థాయిలో లేడు అని ఒకానొక సందర్భంలో చెప్పాడు మెగాస్టార్. దీన్నిబట్టి అల్లు అరవింద్, చిరంజీవి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ జనరేషన్ వచ్చిన తర్వాత కూడా చిరంజీవి కెరీర్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉదాహరణకు ఉపాసన కొణిదెల మావయ్య ఆరోగ్య సూత్రాలను దగ్గరుండి చూసుకుంటుంది. ఆమె వల్లే ఈ రోజు తాను ఇంత ఫిట్ గా ఉండగలుగుతున్నాను అని చెబుతున్నాడు మెగాస్టార్. ఫుడ్ విషయంలో కానీ జిమ్ విషయంలో కానీ తనయుడు రామ్ చరణ్ జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఇలా చిరంజీవి కెరీర్ ను ప్రతి దశలోనూ ఎవరో ఒకరు వెనుక ఉండి నడిపిస్తూనే ఉన్నారు. ఇక ఆయనకు కొండంత అండగా అభిమానులు ఎప్పుడు తోడుగానే ఉంటారు. ఇలా వీళ్లందరి బలంతో మెగాస్టార్ ఈరోజు చక్రం తిప్పుతున్నారు.

More Related Stories