English   

రాజమౌళికి షాక్ ఇస్తున్న అమీర్ ఖాన్, షారుక్ ఖాన్..

Aamir Shahrukh Khan
2019-08-07 10:39:58

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెలుగు దర్శకుడు ఏ మాత్రం కాదు. కచ్చితంగా ఆయన సినిమా అంటే ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం వేచిచూస్తూ ఉంటుంది. ఎందుకంటే బాహుబలి సినిమాను ఆయన తెరకెక్కించిన తీరు అలా ఉంది. కచ్చితంగా ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకుల లిస్టులో రాజమౌళి కూడా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఇండియన్ టాప్ 3 దర్శకుల్లో ఈయన కూడా ఒకరు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న RRR సినిమాపై బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా చూసిన అతి పెద్ద మల్టీస్టారర్ అయితే ఇదే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి భారీ మార్కెట్ ఉన్న ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే సినిమాలో కలిసి నటించడం అనేది చిన్న విషయం కాదు. సౌత్ ఇండియాలో అయితే ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు అభిమానులు. ఇక బాలీవుడ్ లో కూడా రాజమౌళి అంటే ఉన్న నమ్మకం RRR సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఇలాంటి సమయంలో ఒక సంచలన వార్త అభిమానుల్లో ఆసక్తి పుట్టిస్తుంది. ఇండియన్ స్క్రీన్ పై రాజమౌళి మల్టీస్టారర్ ను మించి మరో భారీ సినిమా ఒకటి సిద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అది ఇంకెవరో కాదు.. బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ తో కలిసి అమీర్ ఖాన్ విక్రమ్ వేద హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు షారుక్ ఖాన్ తో కలిసి తొలిసారి స్క్రీన్ పంచుకోవడానికి సిద్ధమవుతున్నాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ఖాన్స్ త్రయం ఊహించినట్లుగా విజయం సాధించడం లేదు. ఇలాంటి సమయంలో షారుక్, అమీర్ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారనేది అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చే విషయం. అంజమ్ రాజబాలి చేస్తున్న సారే జహాసే అచ్చా సినిమా కోసం షారుక్ అమీర్ కలిసి నటిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇది గాని నిజం అయ్యింది అంటే ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ సినిమా ఇదే అవుతుంది.
 

More Related Stories