English   

షాకింగ్ లుక్‌లో నవదీప్  !

Navdeep
2019-08-07 10:58:53

2004లో వ‌చ్చిన జై సినిమా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ని పరిచయం అయ్యాడు న‌వ‌దీప్‌. సరయిన హిట్స్ పడకపోవడంతో మనోడు ఫేడవుట్ అయ్యాడు. దీంతో ఇప్పుడు కేవ‌లం స‌పోర్టింగ్ క్యారెక్టర్స్ మాత్ర‌మే చేస్తున్న న‌వ‌దీప్ అల్లు అర్జున్ 19వ చిత్రంలో ఒక కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఆయ‌న సిక్స్ ప్యాక్ తో కూడిన లుక్ ఒకటి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. కొద్ది రోజులుగా పెద్దగా కనపడని ఆయన జిమ్‌ లో శ్ర‌మించి నట్టున్నాడు, అందుక కండలు తిరిగిన దేహంతో బాలీవుడ్ హీరో లుక్‌లో ఆదరగొడుతున్నాడు. ఆయ‌న లుక్‌ని చూసిన వారంతా అసలు మనోడు ఈ లుక్ లోకి ఎందుకు చేరాడా ? అని ఆరా తీస్తున్నారు. అయితే ఈ లుక్స్ ని తన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన నవదీప్ తానిలా మారడానికి తన ట్రైనర్ కృష్ణ సద్వలే కారణమని చెప్పాడు. అలాగే తనకి బన్నీ, చెర్రీ, రానా తనని ఎంతో ఇన్‌స్ఫైర్ చేశారని కూడా ఈ పోస్ట్ ద్వారా పేర్కొన్నారు.

More Related Stories