ట్రంప్ కంపెనీలో ఉద్యోగిని పెళ్లి చేసుకున్న హాట్ బాంబ్ !

బాలీవుడ్ హాట్ గాళ్ రాఖీ సావంత్ హాట్ గాళ్ అనడం కంటే ముదురు ముద్దుగుమ్మ అనాలేమో ? తాజాగా ఈ భామ పెళ్లి చేసుకున్నానని ప్రకటించింది. గతంలోనే ఇండియాస్ గాట్ టాలెంట్ షో కంటెస్టెంట్ దీపక్ కలాల్‌ను వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించి రచ్చ రేపిన ఆమె కొద్ది రోజుల తర్వాత మా పెళ్లి జరగడం లేదని ప్లేటు తిరగేసింది. అలాగే ఆమె ఓ ఎన్నారైని రహస్యంగా వివాహం చేసుకుందని, జూలై 28న ఆమె పెళ్లి జరిగిందని గాసిప్స్ రాగా ఏమనుకుందో ఏమో కానీ ఆమె వార్తలను ఖండించింది. ‘జేడబ్ల్యూ మారియట్‌లో పెళ్లి షూట్లో పాల్గొన్నాను. అంత మాత్రం దానికి నాకు పెళ్లైపోయిందని ఎందుకు ప్రచారం చేస్తున్నారని చాలా అమాయకంగా స్టేట్మెంట్ ఇచ్చింది. అక్కడితో ఆగక ఎవరితో రిలేషన్లో లేనని, ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానని చెప్పింది. అందరూ నిజమే అని అనుకున్నారు కూడా. అది మరువక ముందే మరో బాంబ్ పేల్చింది. అదేంటంటే తాను రితీష్ అనే ఎన్నారై ని వివాహం చేసుకున్నట్టు తెలిపింది. జూలై 20న తమ పెళ్లి చాలా సీక్రెట్ గా, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిందని, తన భర్తకి హడావిడి నచ్చదని, మీడియా, ఫోటోలు వంటి వాటిపై పెద్దగా ఆసక్తి చూపడని చెప్పుకొచ్చింది. అతను హిందూ ఎన్ఆర్ఐ కాగా, నేను క్రిస్టియన్. అందుకే ఫ్యామిలీ మధ్యనే వివాహం జరుపుకున్నామని చెప్పుకొచ్చింది. అంతే కాక ఆమె భర్త డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన కంపెనీలో పని చేస్తున్నారని చెప్పుకొచ్చింది. అలాగే పెళ్లయింది కదా అని సినిమాలు చేయడం ఆపనని ఆ పని మామూలే అని చెప్పుకొచ్చింది ఈ ముదురు భామ.