డబ్బును చూడగానే జగపతి బాబు గతం గుర్తొచ్చిందా..

ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అనుకుంటున్న మాటలు ఇవే. ఒకప్పుడు జగపతిబాబు ఇలా ఉండేవాడు కాదు.. ఆయన తన ఆస్తిలో సగభాగాన్ని పైగా వృధా ఖర్చులకు పోగొట్టాడు. ఇది ఎవరిని అడిగినా చెబుతారు.. చివరికి అది ఆయనను అడిగినా కూడా ఒప్పుకుంటాడు. తాను చాలా వరకు అమ్మాయిల కోసం ఖర్చు పెట్టాను అంటూ ఓపెన్ గా ఒప్పుకున్న సంచలన హీరో జగపతిబాబు. కెరీర్లో పూర్తిగా మునిగి పోయి అప్పుల్లో ఉన్నపుడు లెజెండ్ సినిమా చేసాడు జేబీ. ఆ తర్వాత మళ్లీ పైకి లేచాడు. ఆ సినిమాలో విలన్ గా నటించి తనదైన ముద్ర వేశాడు జగ్గు భాయ్. లెజెండ్ తర్వాత వరుస అవకాశాలతో దుమ్ము దులిపేస్తున్నాడు. ఈయన గత ఐదేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సంచలనాలు సృష్టిస్తున్నారు జగపతిబాబు. ఇప్పుడు రోజుకు దాదాపు ఐదు లక్షలకు పైగా ఈయన కాల్షీట్ ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అంత బిజీ అయిపోయారు జగపతిబాబు. కొన్ని సినిమాలకు అయితే అంతకంటే ఎక్కువ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. కోట్లు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకు మళ్లీ గతం గుర్తుకు వచ్చింది అంటూ ఇండస్ట్రీలో కొన్ని సెటైర్స్ కూడా పడుతున్నాయి. ఇంతకీ దీనికి కారణం ఏంటి అంటే ఒకప్పుడు క్యాసినో బాగా ఆడి అందులో కోట్లు పోగొట్టుకున్నాడు అని ప్రచారం అయితే ఉంది. ఈ విషయంలో జగపతిబాబు ఒప్పుకోలేదు కానీ సరదాలు, సోకుల కోసం లక్షలు ఖర్చు చేశాడు అంటూ జగపతిబాబుపై చాలా విమర్శలు ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇప్పుడు అన్నీ మరిచిపోయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత తన పని తాను చేసుకున్నాడు జగపతిబాబు. అలాంటి వాటికి దూరంగానే ఉన్నారు ఈయన. కానీ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ గోవాలోని ఒక క్యాసినో క్లబ్ లో కనిపించాడు జగపతిబాబు. దాంతో ఆయన అభిమానులకు మళ్ళీ భయం పట్టుకుంది. డబ్బును చూడగానే మళ్ళీ ఈయనకు క్లబ్బులు గుర్తుకు వచ్చాయి సోషల్ మీడియాలో లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై జగ్గు భాయ్ ఏమంటాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి తప్పుకున్నాడు ఈయన. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ కన్నడ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు జగపతిబాబు.