English   

మహేష్ బాబును కలవాలనుందా.. అయితే ఇలా చేయండి..

 MAHESH BABU
2019-08-07 12:11:05

మహేష్ బాబును కలవాలని ఎవరికి ఉండదు చెప్పండి.. సూపర్ స్టార్ వచ్చి కలుస్తానంటే ఎవరు మాత్రం కాదంటారు. అభిమానులు అయితే ఈ న్యూస్ తెలిసి పండగ చేసుకుంటున్నారు. అసలు వాళ్ల కాళ్లు భూమ్మీద నిలవడం లేదు. ఆయన్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని చూస్తున్నారు. అయితే దీని వెనక చిన్న ట్విస్ట్ ఉంది. అంత ఈజీగా సూపర్ స్టార్ ను కలిసే అవకాశం ఎందుకొస్తుంది చెప్పండి.. దీనికోసం చిన్న టాస్క్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. పైగా మహేష్ బాబును ఇక్కడ కాదు సింగపూర్ లో కలిసి ఛాన్స్ దొరుకుతుంది ఇది పూర్తి చేస్తే. ఇంతకీ విషయం ఏంటంటే సింగపూర్ మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ బాబు మైనపు విగ్రహం ఉందని తెలుసు కదా.. అక్కడ ఆయన్ని కలవాలంటే కొన్ని టాస్కులు పూర్తి చేయాలి. బిగ్ బాస్ హౌజ్ మాదిరి ఇక్కడ కూడా వాళ్లు చెప్పే పనులు పూర్తి చేస్తే అందులో ఓ లక్కీ ఫ్యాన్ ను ఎంపిక చేసి సింగపూర్ తీసుకెళ్లనున్నారు మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు. ఎందుకు కేవలం మహేష్ బాబు అంటే ఇక్కడ కూడా ఓ ట్విస్ట్ ఉంది. ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టిన రోజు ఉంది. అందుకే ఈ కాంటెస్ట్ రన్ చేస్తున్నారు మ్యూజియం నిర్వాహకులు. దీనివల్ల వాళ్లకు కూడా లాభం ఉంటుంది. ఇక ఫ్యాన్స్ కూడా ఫ్రీగా సింగపూర్ చూడొచ్చు. అక్కడ మహేష్ బాబు మైనపు విగ్రహంతో ఫోటోలు కూడా దిగొచ్చు. మరి ఈ లక్కీ ఆఫర్ ఏ ఫ్యాన్ అందుకుంటాడో చూడాలి.

More Related Stories