కాజల్ సినిమాకి కొత్త కష్టాలు !

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది క్వీన్ సినిమా, కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావులు ముఖ్యపాత్రల్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒకేసారి నాలుగు భాషలలో రీమేక్స్ ప్లాన్ చేశారు. దక్షిణాదిన ఉన్న నాలుగు ప్రధాన భాషల్లో ఒకేసారి రీమేక్ చేస్తున్నారు. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పారుల్ `క్వీన్`గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తమిళంలో ‘పారిస్ పారిస్’ పేరుతో విడుదల కానుంది. బడ్జెట్ సమస్యలో ఏమో కానీ ఈ సినిమా మూడేళ్ళ పాటు షూట్ జరుపుకుంది. ఇప్పుడు తీరా షూటింగ్ పూర్తయి, విడుదలకు రెడీ అవుతున్న సమయంలో కొత్తగా సెన్సార్ తలనొప్పులు చుట్టుకున్నాయని అంటున్నారు. అదేంటంటే ఈ సినిమాలో కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని తొలగించాల్సిందే అని తమిళ సెన్సార్ బోర్డు తేల్చి చెప్పినట్టు చెబుతున్నారు. కానీ దానికి మేకర్స్ ఒప్పుకోవడం లేదట, ఎందుకంటే నిజానికి టీజర్లో ఒక చిన్న బిట్ పెట్టడం వలన సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. కానీ సినిమా చూసిన సెన్సార్ అలాంటి సీన్స్ ఎక్కడ ఉన్నా అక్కడ కట్ చెబుతున్నారట. అలా వారు చెప్పింది చెప్పినట్టు కట్ చేసుకుంటూ పోతే సినిమా ఫీల్ పోతుందని భావిస్తున్నారట మేకర్స్. ఇక ఈ సినిమాని తెలుగులో `దటీజ్ మహాలక్ష్మి` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఒక దర్శకుడు సగంలో తప్పుకోవడంతో ప్రశాంత్ వర్మ పూర్తి చేశాడు. దానికేప్పుడు మోక్షం కలుగుతుందో వేచి చూడాలి మరి.