English   

రానాకి క్లారిటీలు ఇవ్వడంతోనే జీవితం సరిపోతుందట !

Rana
2019-08-07 15:24:45

బాహుబలి స్టార్ రానా ఆరోగ్యం చెడిపోయిందని, ఆయనకి ఏమి వ్యాధి వచ్చిందో అర్ధం కావడం లేదని, మరో సారి ఆయనకి కిడ్నీ చెడిపోతే దానిని రీప్లేస్ చేయిన్చుకున్నారని, ఆయన తల్లే ఆయనకి కిడ్నీ ఇచ్చిందని ఇలా ఒకటి కాదు, రకరకాల వ్యాఖ్యానాలు హల్చల్ చేసేవి. ఇక ఈ విషయంలో తాను స్పందించక పోతే ఇంకేం రాస్తారో అనుకున్నాడో ఏమో కానీ ఈ విషయం మీద తాజాగా స్పందించాడు రానా. అదేంటంటే తాను ఆరోగ్యంగా లేనని వస్తున్న వార్తలకు స్పందించడంలో అలసిపోతున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అమెరికా ప్రయాణం వెనుక గల కారణాలు వెల్లడించడం జరిగింది.  రానా నటించిన హాథీ మేరే సాథీ సినిమా విడుదల కావలసి ఉండగా ఆయన 'విరాట్‌ పర్వం' 'హిరణ్యకశిప' అనే సినిమాల్లో నటించనున్నారు. త్వరలో షూట్ కి వేల్లనున్న్న హిరణ్య సినిమా కోసమే ఆయన అమెరికా వెళ్ళాడట. ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్షన్ లో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థనే నిర్మిస్తోంది. అందుకే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల విషయమై అమెరికా వెళ్లినట్లు ఆయన వెల్లడించారు. విజువల్‌ ఎఫెక్ట్‌ కంపెనీలను కలిసేందుకు అమెరికా వెళ్లానని, హైదరాబాద్‌ నుంచి బయటకు బయలుదేరిన ప్రతిసారీ అభిమానులను ఇలానే టెన్షన్ పెట్టె వార్తలు రాస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

More Related Stories