English   

షూట్ నుండి భర్త లేట్‌గా వస్తున్నాడని నటుడి భార్య ఆత్మహత్య !

Madhu Prakash
2019-08-07 15:47:58

నటుడైన భర్త షూటింగుల పేరుతో రోజూ ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడన్న కారణంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని మణికొండలో నిన్న రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఈరోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న మధుప్రకాష్‌కు గుంటూరుకు చెందిన భారతి అనే యువతీతో 2014లో వివాహమైంది. అప్పటి నుండి భార్య భారతి అమ్మానాన్న, తమ్ముడితో కలిసి మధు ప్రకాష్ మణికొండలోని పంచవటి కాలనీలో నివాసం ఉంటున్నారు. మధు నటుడు కాగా భారతి ఒక ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తోంది. షూటింగులలో బిజీ అయిన మధు ఈ మధ్య తరచూ ఇంటికి ఆలస్యంగా వస్తుండడంతో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం. సోమవారం రాత్రి కూడా లేట్ గా రావడంతో పెద్ద గొడవ జరిగిందట. దీంతో నిన్న ఉదయం జిమ్‌కు వెళ్తున్నట్టు చెప్పిన మధు అటునుంచి అటే షూటింగ్‌కు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో భర్తకు వీడియో కాల్ చేసిన భారతి తాను ఉరివేసుకుంటున్నట్టు చెప్పి బెదిరించింది. అయితే ఈ విషయాన్ని మధు లైట్ గా తీసుకున్నాడు. బెదిరిస్తుందనుకుని కాల్ కట్ చేసి షూటింగ్ ముగిశాక సాయంత్రం 7:30 గంటలకి ఇంటికి వెళ్లాడు. అయితే బెడ్‌రూము లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో భార్యను పిలిచాడు. అయినా లోపలి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో తలుపు తెరిచి చూడగా నిజంగానే ఆమె చీరతో సీలింగ్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, భారతి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

More Related Stories