తమన్నాను బాగా ఇబ్బంది పెడుతున్న బిగ్ బాస్..

ఎవరో చేసిన తప్పుకు ఇంకెవరో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ తమన్నా విషయంలో ఇదే జరుగుతుంది. ఈమెను బిగ్ బాస్ బాగా సతాయిస్తున్నాడు. ఈమెకు దానికి ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా అక్కడ తమన్నా పేరుతో ఉన్న ఒక వ్యక్తి చేస్తున్న రచ్చ ఈమె కొంప ముంచుతుంది. అసలు విషయం ఏంటంటే రెండు వారాల కింద హేమ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రిని బిగ్ బాస్ హౌస్ లో కి పంపించారు. వచ్చిన రెండు రోజులు బాగానే ఉన్న తమన్నా మూడో రోజు నుంచి తన విశ్వరూపం చూపించడం మొదలు పెట్టింది. ఎవరిని పడితే వారిని టార్గెట్ చేయడం.. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడం.. కావాలని గొడవ పెట్టుకోవడం ఇవన్నీ తమన్నా సింహాద్రి స్టైల్. దాంతో సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ ఎక్కువగానే వస్తున్నాయి. ఇక్కడే హీరోయిన్ తమన్నా కు అసలు సమస్యలు మొదలయ్యాయి. తమన్నా సింహాద్రిని విమర్శిస్తూ చేస్తున్న ట్రోలర్స్ హీరోయిన్ తమన్నా పేరును కూడా ట్యాగ్ చేస్తున్నారు. దాంతో తమన్నా సోషల్ మీడియా పేజీ ఇప్పుడు నిండిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఆమెను విమర్శిస్తూ వస్తున్న ట్రోలింగ్ చూసి తమన్నా భాటియా కూడా షాక్ అవుతుంది. ఎవరో చేసిన తప్పుకు తాను ఎందుకు శిక్ష అనుభవించాలి అని చెబుతోంది తమన్నా. నేరుగా తమన్నా సింహాద్రి అని పూర్తి పేరు ట్యాగ్ చేయకుండా కేవలం తమన్నా అని మాత్రమే చేయడం ఎందుకు అని అభిమానులను ప్రశ్నిస్తుంది ఆమె. దయచేసి పూర్తి పేరుతో ట్యాగ్ చేసి తనను బతికించండి అంటుంది. బిగ్ బాస్ తో అసలు ఏ మాత్రం సంబంధం లేకపోయినా కూడా తాను ఈ విషయంలో చాలా బాధ పడుతున్నట్లు చెబుతుంది తమన్నా. మరి ఈమె బాధను అభిమానులు అర్థం చేసుకుంటారా లేదా అనేది చూడాలి.