సంపూ కోసం రియల్ పెదరాయుడు !

టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ కొబ్బరిమట్ట. సుమారు నాలుగు సంవత్సరాల క్రితేమే రెడీ అయిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఎట్టకేలకు ఈ సినిమా మరో రెండ్రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ - మాదాపూర్ లోని సైబర్ కన్వెన్షన్ లో ఈ వేడుకను జరగనుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా మోహన్ బాబు, అతిధిగా హీరో సందీప్ కిషన్ లు రానున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా సంపూ స్పందిస్తూ .. "నాలాంటి ఒక చిన్న నటుడు రిలీజ్ ఫంక్షన్ కి రమ్మని అడిగిన వెంటనే ఆశీర్వదించడానికి విచ్చేస్తున్న రియల్ పెదరాయుడు శ్రీ మోహన్ బాబు గారికి పాదాభివందనాలు" అంటూ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలాడు. ఈ సినిమాలో సంపూ సంపూ పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడు అనే మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. రూపక్ రొనాల్డ్సన్ డైరెక్షన్లో వస్తున్నఈ సినిమాలో షకీలా, కత్తి మహేష్ లు సంపూకి తల్లితండ్రులుగా నటించనున్నారు. ఇషికా సింగ్, గాయత్రీ గుప్తా, గీతాంజలిలు సంపూ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు.