English   

రణరంగం సెన్సార్ టాక్ !

Ranarangam
2019-08-07 19:27:37

కేశవ, స్వామి రారా సినిమాల ఫేమ్ యువ డైరెక్టర్ సుధీర్‌ వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా నటించిన తాజా చిత్రం రణరంగం. కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా షూట్ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే రిలీజ్ కి ప్లాన్ చేశారు. అయితే ముందు ప్రకటించిన ప్రకారం అయితే ఆగస్టు 2న ఈ సినిమాను విడుదల చేయాలి. అయితే ఎందుకో ఏమో కానీ ఈ సినిమాని ఏకంగా రెండు వారాలు పోస్ట్ పోన్ చేసి మరీ సాహో  ఖాళీ చేసిన డేట్ నాడు రిలీజ్ ఫిక్స్ చేశారు. అలా ఆగష్టు రెండున రిలీజ్ కావాల్సిన సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. శర్వానంద్ గ్యాంగ్ స్టర్‌ గా నటించగా ఆయన సరసన కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చిన ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో హింస పాళ్లు కాస్త ఎక్కువ కావడంతో ఈ సినిమాకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అలాగే సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ వారు సినిమా బాగా వచ్చిందని అభినందించినట్టు చెబుతున్నారు. ఇక అదే రోజున ఈ సినిమాతో పాటు అడివి శేష్ నటించిన ఎవరు సినిమా కూడా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాల మధ్య ప్రధాన పోటీ ఉండనుందనీ అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories