English   

హీరోగా రానా తమ్ముడు...ఆ డైరెక్టర్ తోనేనా ?

abhi
2019-08-07 20:06:30

టాలీవుడ్‌లో వారసుల ఎంట్రీ మామూలే. ఎంత మంది ఎంట్రీలు ఇచ్చినా వారసుల్లో కొద్ది మంది పరిశ్రమలో నిలదొక్కుకుకో గలరు. దగ్గుబాటి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రానా మెల్ల మెల్లగా టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల జాబితాలో చేరి  ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన లక్ చెక్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వారి కుటుంబం నుండి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్దమయ్యిందని అంటున్నారు. నిజానికి టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతం వరకూ అభిరామ్ పేరు ఇండస్ట్రీలో ఉన్నవారికి తప్ప బయటవారికి పెద్దగా పరిచయం లేదు. అభిరామ్‌ను సినీ జనానికి పరిచయం చేసేసింది శ్రీరెడ్డి. నిజానికి అభిరామ్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ఇప్పటికే యాక్టింగ్‌ క్లాస్‌లకు కూడా హాజరు అయ్యాడు కూడా. ఒకటి రెండు సినిమాలకు సహాయ దర్శకుడిగా, ఎక్సిగ్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన అభిరామ్‌ హీరోగా పరిచయం అవ్వడం ఖాయమని చెబుతున్నారు. నిజానికి రెండేళ్ళ క్రితమే ఆయన హీరోగా సినిమా ప్రయత్నాలు జరిగాయి. కాని అనేక కారణాల వలన అది సాధ్యం కాలేదు. అయితే ఎలా అయినా రెండో కొడుకును కూడా హీరోని చేసేస్తే తన పని పూర్తవుతుందని భావిస్తున్న సురేష్ బాబు అభిరామ్ కోసం కథలు వింటున్నారట. హిందీ హిట్ సినిమాలను కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అయితే కధ ఫైనల్ కాలేదు కానీ దర్శకుడు మాత్రం ఫైనల్ అయ్యారని అంటున్నారు. అది ఎవరో కాదు చిలసౌ సినిమాతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరొంది ఇప్పుడు నాగార్జునటో మన్మధుడు సినిమా చేస్తున్న రాహుల్ రవీంద్రన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. రానా స్టార్‌ స్టేటస్ తెచ్చుకోడానికి పది ఏళ్ళు పట్టింది మరి అభిరామ్‌కు అసలు ఆ సత్తా ఉందా అనేది తెలియాలి అంటే మరో రెండు మూడేళ్ళు ఎదురు చూడాల్సిందే.

 

More Related Stories