English   

గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేస్తారా ?

nani
2019-08-08 07:34:25

జెర్సీ సినిమాతో హిట్ కొట్టి మంచి ఊపు మీదున్న న్యాచురల్ స్టార్ నాని, తాజాగా గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ఆగష్టు 30గా ప్రకటించారు. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడక తప్పదని తేలిపోయింది. ఎందుకంటే సాహో ఆరోజునే రిలీజ్ డేట్ లాక్ చేసుకోవడంతో ఈ సినిమా వెనక్కి వెళ్ళక తప్పదని అంటున్నారు. సాహో లాంటి భారీ సినిమాతో పోటీకి వెళ్లడం కంటే వాయిదా వేసుకోవడం మంచిదని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు  భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే ముందుగా ప్రకటించినట్టుగా ఆగస్ట్ 30న కాకుండా సెప్టెంబర్ 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మీద ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ చేయాలని అనుకుంటున్నా సాహోకి మంచి పాజిటివ్ టాక్ వస్తే గనుక ఇబ్బంది పడతామని అనుకుంటున్నారు. నిజానికి సెప్టెంబర్ 13న వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న వాల్మీకి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ గ్యాంగ్ లీడర్ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుంది అనే విషయం ఈరోజు లేదా రేపటిలోగా క్లారిటీ రావచ్చని అంటున్నారు

More Related Stories