బాజాలు మోగే టైమొచ్చిందట ?

టాలీవుడ్ లో ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మిల్క్ బ్యూటీ తమన్నా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందట. మంచు మనోజ్ సరసన శ్రీ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెర మీద ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ భామ ఆ సినిమాతో పెద్దగా బ్రేక్ తెచ్చుకోకున్నా హ్యాపీడేస్ సినిమాతో మాత్రం హిట్ హీరోయిన్ అనిపించుకుంది. అప్పటి నుండి దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన తమన్నా బాహుబలి లాంటి ప్రేస్టేజియస్ మూవీలో నటించినా ఆమెకి పెద్దగా పేరు రాలేదు. అయితే ఆ తర్వాత సరైన సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇక నటనకి గుడ్ బై చెప్తుందేమో అని అనుకున్న సమయంలో ఎఫ్ -2 సక్సెస్ తో మళ్ళీ కొంచెం బిజీ అయ్యింది ఈ భామ. అయితే ఈ మధ్య ముంబైలో ఒక ఫ్లాట్ డబుల్ రేట్ పెట్టి కోందని, పెళ్లి కోసమే అని పుకార్లు లేచాయి. అయితే ఆ విషయాన్ని కొట్టి పారేసిన ఆమె అలాంటి ఆలోచన ఏదీ లేదని చెప్పింది. అయితే ఇప్పుడు మా అమ్మ మంచి కుర్రాడిని వెతికే పనులలో ఉందని చెప్పి షాకిచ్చింది ఈ బ్యూటీ. పెళ్లి విషయంలో పూర్తి బాద్యత మా అమ్మదే నని, ఎవరిని వివాహం చేసుకోవాలనేది మా అమ్మ నిర్ణయిస్తుందని తమన్నా చెప్పుకొచ్చింది. తాను ఎవరినీ ఇంతవరకూ ప్రేమించలేదని, ఎవరినైనా ప్రేమిస్తే ముందుగా మీడియాకే చెబుతానని ఆమె ముందరి కాళ్ళకి బంధం వేసింది కూడా. ప్రస్తుతం తమన్నా తమిళ్ లో విశాల్ కు హీరోయిన్ గా 'పెట్రోమ్యాక్' అనే సినిమాలో నటిస్తోంది. ఇక తెలుగులోనేమో తమన్నా నటించిన దటీజ్ మహాలక్ష్మీ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది.