English   

మిస్ ఇండియా అవుతున్న కీర్తి సురేష్ !

suresh
2019-08-08 08:18:52

అదేంటబ్బా కీర్తి సురేష్ ఎప్పుడు మిస్ ఇండియా అవుతుంది ? ఈ మధ్య మిస్ ఇండియా పోటీలేమీ జరగడం లేదే అనుకుంటున్నారా ? అయితే మీరు అనుకున్న‌ట్లు కీర్తి సురేష్ అయింది రియల్ మిస్ ఇండియా కాదు, రీల్ మిస్ ఇండియావ‌ర‌ల్డ్ కాదు.. మ‌రేంటీ…? మిస్ ఇండియాగా కీర్తి సురేష్ నిజ జీవితంలో కాదు కానీ, రీల్ జీవితంలో… ఓ ఇండియా. నిజానికి మ‌హాన‌టి త‌రువాత తెలుగులో కీర్తి సురేష్ మ‌రో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. నరేంద్ర అనే నూతన దర్శకుడితో కలిసి ఆమె సినిమా చేస్తోంది. ప్రస్తుతం షూట్ చివరి దశలో ఉన్న ఈ మూవీకి 'మిస్ ఇండియా' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ముందుగా సఖి అనే టైటిల్ అనుకున్నా మళ్ళీ ఏమనుకున్నారో ఏమో కానీ ఈ సినిమాకి మిస్ ఇండియా అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన రాలేదు కానీ అదే ఫైనల్ అని అంటున్నారు. మహిళల మీద జరిగే దాడులను ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నారని సమాచారం. ఈస్ట్‌కోస్ట్ బ్యానర్‌పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేష్, నదియా, రాజేంద్రప్రసాద్, కమల్ కామరాజు, భానుశ్రీ మెహ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More Related Stories