English   

సాయి రాజేష్ ఆ సెటైర్ వేసింది వాళ్ళకేనా ?

sai rajesh
2019-08-08 13:26:47

కామెడీ హీరోగా సంపూర్ణేశ్ బాబుకి మంచి క్రేజ్ వుంది. హృదయ కాలేయం లాంటి ఒక కామెడీ సినిమా ద్వారా హీరోగా మారిన ఆయన కథానాయకుడిగా 'కొబ్బరిమట్ట' సినిమా రూపొందింది. అనేక కారణాల వలన ఈ సినిమా ఆలస్యంగా థియేటర్లకు వస్తోంది. 2015లో “కొబ్బ‌రి మ‌ట్ట” సినిమా మొదలయ్యింది అనేక అడ్డంకులు ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్ట‌కేల‌కి ఆగ‌స్ట్ 10న విడుద‌ల‌య్యేందుకు సిద్ద‌మైంది. రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఈ ఈవెంట్ లో చాలా ఎమోషనల్ అయ్యాడు సంపూ, ఈ సినిమా రిలీజ్ అవ్వదని చాలా మంది చాలా విధాలుగా అన్నారని చెప్పుకొచ్చాడు. అయితే అలా చెబుతున్నప్పుడు ఒక కుర్రాడు అమాంతం వచ్చి సంపూ కాళ్ళ మీద పడతాడు, బౌన్సర్స్ వచ్చి ఆయన్ను పక్కకి తీసుకెళ్ళారు. అయితే సంపూ స్పీచ్ అంతా అయిపోయాక ఆ కుర్రవాడిని దగ్గరకి పిలిచి సెల్ఫీ ఇచ్చి తమ్ముడూ ఎందుకు కాళ్ళ మీద పడ్డావని అడిగితే ప్రొడ్యూసర్ పడమన్నాడని చెబుతాడు. వినడానికి కామెడీగా ఉన్నా ఇది ప్రస్తుత పరిస్థితి మీద వేసిన సెటైర్ అని అంటున్నారు. ఎందుకంటే మొన్న డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, రణరంగం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా ఇలానే జరిగింది. అయితే నిజంగా అభిమానులేమో అని అందరూ అనుకున్నారు. అయితే కావాలనే ప్రొడ్యూసర్స్ పడమన్నారు అని అర్ధం వచ్చేలా ఈ సినిమా ప్రొడ్యూసర్ సాయి రాజేష్ సెటైర్ వేసాడని అంటున్నారు.

More Related Stories