English   

సాహో ట్రైలర్ వచ్చేస్తుంది.. ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ..

Saaho Trailer
2019-08-08 14:13:51

ప్రభాస్ అభిమానులు సాహో సినిమా కోసం ఎంతగా వెయిట్ చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాహుబలి 2 తర్వాత మరో రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నాడు ప్రభాస్. వరుస సినిమాలు చేస్తాను అని చెప్పినా కూడా సాహో బడ్జెట్ తో పాటు రేంజ్ కూడా పెరిగి పోవడంతో దీని కోసం మరో రెండు సంవత్సరాలు కూర్చోవాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఆగస్టు 30న సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా రేంజ్ ఏంటో చూపించింది. ఇక ట్రైలర్ విడుదల తేదీ కూడా అనౌన్స్ చేసారు చిత్ర యూనిట్. అగస్టు 10న సాహో ట్రైలర్ భారీ స్థాయిలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా ఇప్పుడు వచ్చింది. కచ్చితంగా సాహో ట్రైలర్ అంచనాలను అందుకుంటుందని ధీమాగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. హాలీవుడ్ సినిమా స్థాయిలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడనటువంటి యాక్షన్ సన్నివేశాలు సాహోలో ఉన్నాయి అంటున్నారు దర్శక నిర్మాతలు. ప్రత్యేకంగా వీటి కోసమే దాదాపు 140 కోట్లు ఖర్చు చేయించాడు దర్శకుడు సుజీత్. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు సాహో కోసం పని చేశారు. దానికితోడు ప్రభాస్ కూడా ఈ యాక్షన్ సన్నివేశాల కోసం అమెరికాలో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక బాలీవుడ్ హాలీవుడ్ తో పాటు మిగిలిన టెక్నీషియన్స్ కూడా సాహో సినిమా కోసం పని చేశారు. ఎటు చూసుకున్న బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. కచ్చితంగా సాహో సినిమా మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఒకవేళ ఇదేగాని జరిగితే సుజీత్ కొత్త చరిత్రకు తెర తీసినట్లే. ఎందుకంటే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా తర్వాత సినిమాతో హిట్టు కొట్టలేదు. ఇప్పుడు ఆ చరిత్రను మార్చాలని చూస్తున్నాడు సుజీత్.

More Related Stories