English   

విడుదలకు ముందే నెట్లో ప్రత్యక్షమైన అజిత్ సినిమా..

Nerkonda Paarvai
2019-08-08 17:16:55

తమిళనాట అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుంది అంటే అభిమానులు వేయి కళ్ళతో వేచి చూస్తుంటారు. అలాంటి ఒక స్టార్ హీరో సినిమాకు ఇప్పుడు షాక్ ఇచ్చారు లీక్ రాయుళ్లు. విడుదలైన తర్వాత ఎలాగూ పైరసీ జరగకుండా ఆపలేకపోతున్నారు నిర్మాతలు. ఈ విషయంలో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక మూల నుంచి పైరసీ అయితే వచ్చేస్తుంది. విడుదలైన రోజు సాయంత్రానికి ఆన్ లైన్ లో ఆ సినిమా దర్శనమిస్తుంది. దానికి చేయాల్సిన ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నా కూడా ఆపడంలో విఫలం అవుతున్నారు సైబర్ డిపార్ట్మెంట్. ఇదిలా ఉంటే ఇప్పుడు అజిత్ హీరోగా నటించిన నెర్కొండ పర్వై సినిమా విడుదలకు రెండు రోజుల ముందే నెట్లో ప్రత్యక్షం అయింది. దాంతో అభిమానులతో పాటు దర్శక నిర్మాతలు కూడా షాక్ అయ్యారు. ఈ విషయంపై నిర్మాత బోనీకపూర్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ను ఆశ్రయించాడు. తన సినిమాను పైరసీ కాకుండా అడ్డుకోవాలని దాదాపు 1130 వెబ్ సైట్ లను క్లోజ్ చేయించాడు. అయినా కూడా లాభం లేకుండా పోయింది. సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ఆన్లైన్ లో లీక్ కావడంతో అజిత్ అభిమానులు అయ్యారు. ఈ సినిమా ఈ వారమే విడుదలైంది. పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన నెర్కొండ పర్వైకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా అజిత్ నటనకు నీరాజనాలు పడుతున్నారు ప్రేక్షకులు. ఇలాంటి సినిమాలు థియేటర్లలో చూసి ఆదరించాలి కానీ పైరసీ చేసి విడుదలకు ముందే లీక్ చేయడం బాగోలేదు అంటూ బాధ పడుతున్నారు దర్శక నిర్మాతలు. అయినా అజిత్ లాంటి సూపర్ స్టార్ సినిమాకే ఇలాంటి తిప్పలు వస్తే చిన్న సినిమాల పరిస్థితి ఏంట అని భయపడుతున్నారు నిర్మాతలు.
 

More Related Stories