English   

వినాయక్ మళ్లీ మెగాఫోన్ పడుతున్నాడు.. హీరో ఎవరో తెలుసా..

Vinayak
2019-08-08 19:11:45

దర్శకుడు వివి వినాయక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సంచలన సినిమాలు తెరకెక్కించిన ఈ దర్శకుడు ఈ మధ్య వరుస పరాజయాలతో రేసులో పూర్తిగా వెనుకబడి పోయాడు. ఆయనతో సినిమాలు చేయడానికి ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపించడం లేదు. ఇక చిన్న హీరోలు సైతం వినాయక్ అంటే ఎందుకు రిస్క్ అనుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించిన ఇంటెలిజెంట్ సినిమా డిజాస్టర్ కావడంతో వినాయక్ పై పూర్తిగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చేసింది. ఆ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయిన కూడా ఇప్పటివరకు వినాయక్ మరో సినిమా మొదలు పెట్టలేదు. బాలకృష్ణతో సినిమా ఓకే అయినా ఆయన మాత్రం పట్టించుకోనట్లు ఉన్నాడు. దాంతో ప్రస్తుతం దర్శకుడి నుంచి నటుడిగా మారిపోయాడు ఈ దర్శకుడు. శ్రీనివాసరావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా చేస్తున్నాడు వినాయక్. ఇది పూర్తయిన తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్నాడు ఈయన. తనకు అచ్చొచ్చిన హీరోతోనే నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. పదేళ్ల కింద కృష్ణ అంటూ నానా రచ్చ చేసిన రవితేజతోనే వినాయక్ ఇప్పుడు ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. ఆయనకు కూడా హిట్ కొట్టడం కీలకం. ఇలాంటి సమయంలో వినాయక్ తో సినిమా చేయడం అంత మంచిది కాదు అంటున్నారు ఆయన అభిమానులు. వినాయక్ టేకింగ్ గురించి రవితేజ కు ఒక ఐడియా ఉంది. మంచి కథ దొరికితే ఖచ్చితంగా బాక్సాఫీసు బద్దలు కొడతాడు అని నమ్ముతున్నాడు మాస్ రాజా. మరి ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు రాబోతుందో చూడాలి. ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా సినిమాతో బిజీగా ఉన్నాడు.

More Related Stories