English   

రవితేజకు ఊహించని షాక్ ఇచ్చిన తమిళ హీరో..

Jayam Ravi
2019-08-08 19:28:06

అసలు రవితేజ ఇప్పుడు వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఒక్క హిట్ కొడితే కానీ మళ్లీ ఈయన కెరీర్ గాడిన పడదు. అందుకే చేయాల్సిన ప్రయోగాలు మొత్తం చేస్తున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈయన వి.ఐ.ఆనంద్ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా సినిమాలో నటిస్తున్నాడు. ప్రయోగాత్మక సినిమాలు తెరకెక్కించే అలవాటు ఉన్న ఆనంద్ ఇప్పుడు రవితేజతో కూడా ఇలాంటి ప్రయోగమే చేస్తున్నాడు. చాలాకాలం పాటు కోమాలో ఉండి బయటికి వచ్చిన ఒక వ్యక్తి ప్రస్తుతం ఆధునిక సమాజంతో అడ్జస్ట్ కాకుండా ఉండే ఒక కథను డిస్కో రాజా సినిమాలో చూపిస్తున్నాడు ఆనంద్. ఇందులో మాస్ రాజా తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. సైంటిస్ట్ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఒక తమిళ హీరో ఇప్పుడు రవితేజ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. అతనే జయం రవి.. ప్రస్తుతం ఈయన కోమలి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో కూడా హీరో చాలా కాలం పాటు కోమాలో ఉండి ఆ తర్వాత బయటకు వస్తాడు.. అప్పుడు మారిపోయిన సమాజాన్ని చూసి తట్టుకోలేక పోతాడు. ఆ సమయంలో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే కామెడీగా చూపిస్తున్నాడు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సంచలనం సృష్టిస్తుంది. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్. కాన్సెప్ట్ కొత్తగా ఉందని తెలుగులో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కాస్త ఆలోచించి రవితేజ కూడా ఇలాగే ఉంటుందని తెలుస్తోంది. అందుకే కోమలి టీజర్ చూసిన తర్వాత డిస్కో రాజా యూనిట్ లో భయం మొదలైంది అని ప్రచారం జరుగుతుంది. కానీ ఎవరి సినిమా వాళ్ళది. మ్ ఎవరి కథ వాళ్ళదే కచ్చితంగా రవితేజ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెబుతున్నాయి యూనిట్ వర్గాలు. రవితేజకు జోడీగా నభ నటేష్, ప్రియాంక జువల్కర్, పాయల్ రాజ్ పుత్  నటిస్తోంది. డిసెంబర్లో సినిమా విడుదల కానుంది.

More Related Stories