English   

విష్ణు భార్య డెలివరీ లైవ్ ఇస్తారట !

Manchu Vishnu
2019-08-08 19:36:49

మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుల్లో మంచు విష్ణు ఒకరు. దాదాపు డజను సినిమాలకు పైగా చేసిన ఆయనకు ఒకే ఒక్క హిట్ ఉంది. ఎలా అయినా మరోసారి హిట్ కొట్టాలని విక్రమార్క ప్రయత్నం చేస్తూనే ఉన్నాడాయన. ఈ మధ్యకాలంలో హైదరాబాదులో లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభించడంతో ఆయన ఇంకా సినిమాల వైపు చూడడని అనుకున్నారంతా. అయితే అలా అనుకున్న వాళ్ళందరికీ షాక్ ఇస్తూ ఒకేసారి మూడు ప్రాజెక్టు మొదలు పెట్టి షూట్ కి వెళ్ళాడు. అయితే ఈ రోజు ఆయన చేసిన ఒక ట్వీట్ ఆసక్తికరంగా మారింది. అదేంటంటే ఆయన తన భార్య విరోనికా రెడ్డి ప్రసవించే సమయంలో ప్రసవించే ప్రాసెస్ అంతటినీ ఇంస్టాగ్రామ్ లో లైవ్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. అయితే ఇది ఇది తన ఐడియా కాదని ఐడియా కాజల్ ఇచ్చిందని ఆమెకు థాంక్స్ చెబుతూ ఒక ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ మీద నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు, ఒకరేమో కాజల్ చెప్పిందట ఈయన చేస్తారట, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటూ కామెంట్ చేశారు. అయితే ఇది ఇది ప్రసవాల విషయంలో కొన్ని వెనుకబడిన ప్రాంతాల వారికి ఉన్న అపోహలను దూరం చేయడం కోసమేనని చెబుతున్నారు. కాజల్ ఈ విషయం మీద కొన్ని సంస్థలతో పనిచేస్తుందట, అందుకే విష్ణుని ఈ విషయం మీద ఒప్పించిందట. అయితే ఈ పోస్ట్ చూసిన విష్ణు భార్య మాత్రం, మీ ఇద్దరినీ కొడతానని సరదాగా కామెంట్ చేసింది. విష్ణుకి ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉండగా ఇప్పుడు మరోసారి వెరోనికా గర్భంతో ఉన్నారు. ప్రస్తుతం కాజల్, విష్ణు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు.

More Related Stories