English   

గ్యాంగ్ లీడర్ వాయిదా పడ్డట్టే….క్లారిటీ ఇచ్చిన నాని !

gl
2019-08-08 20:54:40

ఆగస్టు 15 రిలీజ్ కానున్న సాహో సినిమా ఎన్నో సినిమాల రిలీజ్ డేట్ లో మార్పునకు కారణమైంది. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడడంతో చాలా సినిమాలు తమ తమ రిలీజ్ డేట్ లు వాయిదా వేసుకోవడం గాని ముందుకు జరపడం గాని చేశాయి. అయితే ఒక సినిమా మాత్రం ఇప్పటి దాకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. అదే నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం. మనం ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజానికి ఆగస్టు 30న రిలీజ్ కానుందని తొలుత ప్రకటించారు. అయితే అనుకోకుండా సాహో వాయిదా పడడంతో ఈ సినిమా కూడా వాయిదా పడుతుందని, సాహో లాంటి పెద్ద సినిమాతో పోటీ కి దిగదని ప్రచారం జరుగుతూ వచ్చింది. అనుకున్నట్టుగానే ఈ సినిమా వాయిదా పడుతున్నట్టు ఈరోజు ఆ సినిమా హీరో నాని అఫీషియల్ గా ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. సాహో మన సినిమా అని అది జాతీయ స్థాయిలో క్రీస్తు తెచ్చుకోవడం సంతోషించే విషయం అని, అది హిట్ కొడితే మన సంబరాలు మొదలవుతాయని ట్వీట్ చేశారు. అంతేకాక ప్రభాస్ అన్నకి ఈ సినిమా టీం మొత్తానికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి మంచి సక్సెస్ అందివ్వాలని ఆ ట్వీట్ లో కోరాడు. అంతేకాక గ్యాంగ్ లీడర్ కొత్త రిలీజ్ డేట్ రేపు ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. సో నాని ఎప్పుడు వస్తాడనేది రేపు తేలనుందన్న మాట.

More Related Stories