English   

తెలుగు ఇండస్ట్రీకి ప్రధాని మోదీ విజ్ఞప్తి.. కశ్మీర్‌ను డెవలప్ చేయండి..

modi
2019-08-08 21:57:33

ఆర్టికల్ 370 గురించి కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయంపై దేశం అంతా పండగ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్ ప్రజలు అయితే ఆనందంలో తేలిపోతున్నారు. ఇక నుంచి వాళ్లు కూడా మనలో ఒకరిగా బతకనున్నారు. దాంతో వాళ్లంతా గాల్లో ఉన్నారిప్పుడు. ఇలాంటి సమయంలో కశ్మీర్, జమ్మూ, లద్ధాఖ్ లపై వరాల జల్లు కురిపించాడు మోదీ. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీ మాట ఆయననోట వినిపించింది. ఎవరు ఔనన్నా కాదన్నా ఇప్పుడు బాలీవుడ్ తర్వాత ఇండియాలో అంత మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ తెలుగు మాత్రమే. తమిళ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు మన తర్వాతే. అందుకే మోదీ కూడా బాలీవుడ్ తర్వాత తెలుగు ఇండస్ట్రీ పేరు చెప్పారు. ఇండియాలో కూడా చాలా అందమైన ప్రదేశాలున్నాయని.. అందులో కశ్మీర్ కూడా ఒకటి అంటున్నాడు మోదీ. ఇప్పటి వరకు అక్కడ షూటింగ్స్ చేసారని.. ఇప్పట్నుంచి ఇంకా ఎక్కువగా స్వేచ్ఛగా చేసుకోండి అంటూ చెప్తున్నాడు. జమ్మూ కశ్మీర్తో పాటు లద్ధాఖ్ కూడా ఇక నుంచి మనదే అంటున్నాడు ఈయన. అక్కడికి వచ్చి షూటింగ్స్ చేయాల్సిందిగా తెలుగుతో పాటు తమిళ, హిందీ ఇండస్ట్రీలను కోరాడు మోదీ. అలా చేస్తే ఆ ప్రదేశాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు మోదీ. మన దేశాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి కదా అంటున్నారు మోదీ. తెలుగు, తమిళ ఇండస్ట్రీల షూటింగ్స్ కూడా పెంచాలని ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసారు. జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌ల అభివృద్ధిలో వచ్చి భాగం కావాలంటూ కోరారు ఆయన. అంతేకాదు అవసరం అనుకుంటే స్టూడియోలు పెట్టడానికి స్థలాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు ఈయన. మరి మోదీ చెప్పిన దానిపై మన దర్శక నిర్మాతలు ఏం ఆలోచిస్తారో చూడాలి. మొన్నటికి మొన్న గోపీచంద్, తిరు సినిమా షూటింగ్ అంతా లద్ధాఖ్ లోనే జరిగింది.

More Related Stories