రౌడీ అంటే ఇష్టమంటున్న ప్రియా ప్రకాష్

కుర్ర హీరో దేవరకొండకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఈ రౌడీ బాయ్ కి లేడీస్ ఫాలోయింగ్ గట్టిగా ఉంది. ఈ క్రేజ్ ఎలాంటిది అంటే ఎక్కడో రాష్ట్రం కానీ రాష్ట్రం అయిన కర్ణాటక రాజధాని బెంగళూరు లో ఈ మధ్య ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్ చేస్తే ఆ ఈవెంట్ లో మనొడిని కలవడానికి లాఠీ దెబ్బలు సైతం లెక్క చేయక రోప్ లను సైతం నెట్టుకుని వచ్చి మరీ కలిశారు అంటే మనోడిని ఎంతగా అభిమానిస్తున్నారో అర్థం అవుతోంని. అయితే మామూలు అమ్మాయిలే కాక కొంతమంది హీరోయిన్లు కూడా విజయ్ పై తమ ఇష్టాన్ని బహిరంగం చేశారు. అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సైతం విజయ్ తో సినిమా చేయాలని ఉందని స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే అదేమో కానీ తాజగా కన్ను గీటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన నటి ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని చెబుతోంది. ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అంటూ విజయ్ దేవరకొండతో కలిసి దిగిన ఓ ఫొటోను ప్రియా వారియర్ పోస్ట్ చేసింది. అయితే, ఈ ఫొటోను ఏ సందర్భంగా వాళ్లిద్దరూ దిగారో ఆమె ప్రస్తావించలేదు. అయితే ఆమె ఇష్టమని చెబుతున్నా వీరిద్దరికీ లింక్ చేసి మరీ వార్తలు రాస్తారు మన గాసిప్ రాయుళ్లు, ఇష్టం వేరు ప్రేమ వేరు కానీ రెంటినీ కలిసి భవిష్యత్తులో వార్తలు వచ్చినా ఆశ్చర్యం లేదు.