English   

పాకిస్తాన్ లో ఇండియన్ సినిమాలు బ్యాన్.. నష్టం వాళ్లకే.. 

indian films
2019-08-09 07:23:47

పుల్వామా టెర్రర్ అటాక్ తర్వాత ఇండియాలో పాకిస్తాన్ పై ఆగ్రహావేశాలు ఎక్కువైపోయాయి. ఈ రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం వచ్చింది. ఇక ఇప్పుడు మోదీ తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం మరింత వేడి రాజేసింది. రెండు దేశాలు కసిమీద ఉన్నాయి. జమ్మూ కశ్మీర్ తో పాటు లద్ధాఖ్ పై కూడా ఇప్పుడు భారతదేశానికి సర్వహక్కులు వచ్చేసాయి. ఇన్ని రోజులు ఆర్టికల్ 370ను అడ్డు పెట్టుకుని పాకిస్తాన్ ఎన్నో దారుణాలు చేసిందని చెప్పాడు మోదీ. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై కూడా దెబ్బ పడేలా చేస్తున్నాయి. ఈ సందర్భంగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్. ఇప్పటికే కశ్మీర్, జమ్మూ, లద్ధాఖ్ లలో ఎక్కడికక్కడ పాకిస్తాన్ జెండాలు కనిపిస్తే తగలబెట్టేస్తున్నారు. దానికి తోడు కాశ్మీర్లో కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్న వాళ్లను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ పేరు వింటే భారత్ లో రక్తం మరిగిపోతుంది. ఇండియన్ సినిమాలను పాకిస్తాన్ లో విడుదల చేయకూడదని ఆ దేశం నిర్ణయించుకుంది. ఇదే మంచిదని బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా సరే అంటున్నారు. ఇప్పటికే ఈ ఏడాది వచ్చిన పెద్ద సినిమాలు టోటల్ ధమాల్, మిలన్ టాకీస్, భారత్ లాంటి ఇంకా కొన్ని సినిమాలు పాకిస్తాన్ లో విడుదల కాలేదు. కావాలనే సినిమాల విడుదల ఆపినట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కేవలం పుల్వామా దాడుల కారణంగానే కాదు.. పైరసీ కూడా పాకిస్తాన్ లోనే మొదలవుతుందని.. అందుకే అక్కడ సినిమాలు విడుదల చేయడం ఆపేస్తే మంచిది అంటున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ కూడా స్వయంగా ఇదే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇండియన్ సినిమాలకు పని చేస్తున్న పాక్ నటులను, టెక్నీషియన్స్ ను తిప్పి పంపించేస్తున్నారు. వాళ్లను ఇకపై భారత సినిమాల్లో తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇలా చేయడం వల్ల భారత్ కంటే ఎక్కువ నష్టపోయేది పాకిస్తానే. మరి ఇది ఇండియా, పాకిస్తాన్ సినిమా ఇండస్ట్రీలలో ఎలాంటి విభేదాలు తీసుకొస్తుందో చూడాలి.

More Related Stories