English   

వినాయక్ హీరోగా సినిమా...లాంచ్ ఎప్పుడంటే ?

Vinayak
2019-08-09 08:49:04

ఎంతో మంది హీరోలకు సూపర్ హిట్ చిత్రాలను అందించి ఎంతో మందికి ఆల్ టైం రోల్ మోడల్ అయిన దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా అవతారం ఎత్తనున్నారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు కూడా ధ్రువీకరించారు. హీరో అని అయితే చెప్పలేదు కానీ యాక్టర్ గా తమ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ మీదనే లాంచ్ చేస్తున్నామని దిల్‌ రాజు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందట. ఆ మధ్య ఈ సినిమా కోసం సన్నబదేందుకు వినాయక్ కసరత్తులు కూడా చేస్తున్న వినాయక్ స్టిల్ కూడా ఒకటి వైరల్ అయింది. అయితే వినాయక్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయిందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అక్టోబర్ 9న దసరా తర్వాతి రోజున ఈ సినిమాని ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. మెగాస్టార్ సహా ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు లాంచ్ కి హాజరై వినాయక్ కి తమ శుభాకాంక్షలు తెలియచేయనున్నారని అంటున్నారు. గతంలో శంకర్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి శరభ అనే సినిమాను డైరెక్ట్ చేసిన నర్సింహరావు ఈ సినిమాకు దర్శకుడు. ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వినాయక్ ఒక మిడిల్ ఏజెడ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. 2018లో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన 'ఇంటెలిజెంట్‌' తరువాత వినాయక్ మరో సినిమాకు దర్శకత్వం వహించలేదు. బాలయ్యతో సినిమా అనుకున్నా అదీ పట్టాలెక్కలేదు. తాజాగా రాక్షసుడు సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన వినాయక్ తాను అసలు సినిమా చేస్తున్నదే ఫిట్‌ అవడానికి అంతే తప్ప హీరో అయిపోవాలని కాదని, బాడీ ఫిట్‌ అవడానికి ఏదో ఓ కారణం కావాలి నాకు ఈ సినిమా అనే కారణం దొరికిందని చెప్పుకొచ్చారు.  

More Related Stories