English   

అదిరే లుక్ లో మేజర్ అజయ్ కృష్ణ : సరిలేరు నీకెవ్వరు స్పెషల్ టీజర్ 

Sarileru Neekevaru
2019-08-09 10:36:13

ఈరోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంస్థ. మహర్షి సూపర్ హిట్ అయ్యాక మహేశ్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేశ్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హ్యాట్రిక్ చిత్రాల డైరెక్టర్‌ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్స్ సంస్థలు సంయుక్తంగా తెరకేక్కిస్తున్నాయి. మహేష్ సరసన రష్మిక మందనా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి మహేష్ మిలిటరీ మేజర్ అనే విషయమే ఇప్పటిదాకా తెలుసు ఇప్పుడు క్లారిటీగా ఆయన్ని ఫ్యాన్స్ కి చూపించేసారు. బర్త్ డే సందర్భంగా స్పెషల్ టీజర్ రిలీజ్ చేశారు. మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ అదిరిపోయే లుక్‌లో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇంట్రోనే ఒక లెవల్ లో ఉండడంతో ఇక సినిమా మరో రేంజ్ లో ఉంటుందని మహేష్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఇక మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేశ్‌బాబు ఎలా ఉన్నారో మీరూ ఓ లుక్కేయండి..

More Related Stories