English   

మహేష్ బర్త్ డే...సోషల్ మీడియాని ఆక్రమించిన మహేష్ ఫ్యాన్స్ 

Mahesh
2019-08-09 14:58:28

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నేడు 44వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. వయసు నాలుగు పదులు దాటి ఐదవ పడి వైపు పరుగులు పెడుతున్నా ఏమాత్రం చెరగని చిరనువ్వుతో అందంతో ఫ్యాన్స్ ని మరింత పెంచుకుంటూ పోతున్నారు మహేష్. ఇక ఈరోజు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ అయున ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఎవర్ గ్రీన్ హీరో పుట్టిన రోజుని వారం ముందు నుండే మొదలు పెట్టేశారు ఆయన ఫ్యాన్స్. ఒకరకంగా చెప్పాలంటే ఈ డిజిటల్ యుగంలో హాష్ టాగ్ వేడుకలు ఫేమస్ అయ్యాయి. అందుకే హ్యాపీ బర్త్ డే మహేష్ అనే హాష్ టాగ్‌తో ఎక్కువ సంఖ్యలో ఆ రోజు తమ అభిమాన హీరోకి అత్యధిక సంఖ్యలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ సంబరాలు వారం క్రితమే మొదలవ్వగా ఈరోజు ఈ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఇక మొన్ననే మహర్షి సినిమాతో హిట్ కొట్టిన మహేష్ తన 26వ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో మహేష్‌ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా చాలా ఏళ్ల తర్వాత విజయశాంతి ఈ సినిమా ద్వారా తిరిగి వెండితెర మీద ఎంట్రీ ఇస్తోంది. ఇక అజయ్ కృష్ణ అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడు.

More Related Stories