English   

నాగ్ అశ్విన్ చిరంజీవి కాంబినేషన్ లో టైం మెషీన్ సబ్జెక్ట్ ?

Nag Ashwin
2019-08-09 16:04:25

గతేడాది విడుదలయిన మహానటి ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో మనకు తెలియనిది కాదు. ఈ సినిమా హిట్ అయిన వెంటనే ఈ సినిమా టీమ్ అంతటినీ మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌లోని తన స్వగృహానికి ఆహ్వానించి అభినందించారు. నాగ్‌ అశ్విన్ శభాష్ అనిపించాడని,  నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే ఆలోచన వుందని అప్పుడే మెగాస్టార్ తన కోరిక వెలిబుచ్చారు. నాగ్‌ అశ్విన్ దగ్గర టైమ్‌ మిషన్ నేపథ్యంలో ఓ కథ వుందని తాను ఆ సినిమా చేయాలనుకుంటున్నానని స్వయంగా చిరంజీవి పేర్కొన్నారు. అప్పటికప్పుడే చిరంజీవితో తమ సంస్థ అయిన వైజయంతీ మూవీస్ పతాకంపై సినిమా చేయబోతున్నట్లు నిర్మాత అశ్వనీదత్ ప్రకటించారు. భైరవ పేరుతో టైమ్‌మిషన్ నేపథ్యంలో ఓ కథ వుందని, ఆ కధ వింటేనే అద్భుతంగా అనిపించిందని చెప్పుకోచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్ తయారుచేసుకుంటున్న ఈ సినిమా మొత్తం స్క్రిప్టింగ్ పూర్తి కావడానికి సంవత్సరం పడుతుందని, ఆ సినిమాలో చిరంజీవి గారే కథానాయకుడిగా నటిస్తారని అప్పుడు చెప్పుకొచ్చారు. అయితే సినిమా హిట్ కొట్టినప్పుడు ఇలా చెప్పడం మామూలే అనుకున్నా రెండ్రోజుల క్రితం నాగ్ అశ్విన్ సినిమా గురించి వైజయంతీ మూవీస్ నుండి వచ్చిన ఒక ప్రకటన దానికి ఊతం ఇస్తోంది. తాము ఒక గొప్ప ప్రాజెక్టును చేపట్టబోతున్నామని, ఈ యాత్ర సెప్టెంబరులో ప్రారంభం కానుందని తెలిపింది. ఈ కొత్త చిత్రానికి విజువల్‌ ఆర్టిస్టులు, డిజైనర్లు, రచయితలు కావాలని పిలుపు కూడా ఇచ్చింది. అయితే ఈ పెద్ద ప్రాజెక్ట్ పెద్దాయన చిరంజీవితోనేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. దీని మీద ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ ఆ అనుమానాలు తీరవు !
 

More Related Stories