English   

కథనం మూవీ రివ్యూ

Kathanam
2019-08-09 17:46:06

జబర్దస్త్ యాంకర్ అనసూయ తాజాగా నటించిన చిత్రం కథనం. క్షణం, రంగస్థలం, యాత్ర వంటి చిత్రాలతో నటిగా గుర్తింపుతెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ ఈ కథనం సినిమాలో లీడ్ రోల్ లో నటించారు. నూతన దర్శకుడు రాజేష్‌ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాని ది గాయ‌త్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ బ్యానర్స్ మీద న‌రేంద్రరెడ్డి, శ‌ర్మచుక్కా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అనసూయ కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడుతుంది ? సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

కథ:

అను(అనసూయ) తెలుగు సినీ పరిశ్రమలో డైరెక్టర్ మారుతి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుంటుంది. పెద్ద దర్శకురాలిని కావాలని గోల్ ఉన్న ఆమె స్క్రిప్టులు పట్టుకుని నిర్మాతల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమెకు తోడుగా ఆమె ఫ్రెండ్ ధన (ధన్‌రాజ్) కూడా నటనా అవకాశాల కోసం తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో అనసూయకు నలుగురు నిర్మాతలు అవకాశం ఇస్తారు. వాళ్లే ఒక స్టోరీ లైన్ చెప్పి దానిని స్క్రిప్ట్‌ను డెవలప్ చేయమని చెబుతారు. ఆ సినిమాకి అనూ చెప్పిన లైన్ బాగా నచ్చడంతో ఆ సినిమాకి అనసూయనే డైరెక్టర్ గా ఫిక్స్ చేసి మిగతా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేయమంటారు. అయితే ఆ కథకు సంబంధించిన కథనాన్ని అనూ ఎలా రాసుకుంటుందో అలాగే నగరంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ హత్యలు ఆమె రాసినట్టే ఎలా జరుగుతున్నాయి. అనే విషయాలు సినిమాలో చూడాల్సిందే.

కథనం :

ఎలాంటి సినిమాకైనా కథనమే ముఖ్యం. అలాంటి కథనాన్నే ఈ సినిమాకు టైటిల్‌గా పెట్టుకున్నా దానిని పూర్తిగా గాలికి వదిలేశారు అనిపించింది. కథ పరంగా బాగానే ఉన్నా అది తెరకేక్కే పరిణామంలోనే ఎక్కడో దేబ్బెసింది. సినిమా క్లైమాక్స్ లో ఉన్నంత వేగం ఎక్కడా కనిపించలేదు. సినిమా నిడివి తక్కువే అయినా ఆసక్తికరంగా సాగని కథనం ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ను గాలికొదిలేసినట్లు, ఎలాగోలా నడిపించాలి కాబట్టి అన్నట్టు అనవసరమైన సన్నివేశాలు, ఇరికించినట్లు అనిపించే కామెడి.. ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. వెన్నెల కిషోర్‌తో చేయించిన కామెడీ కూడా పెద్దగా నవ్వించలేకపోయింది. ఏదో కావాలని ఇరికించినట్టు అనిపించింది. ఇక కథలో చివరకు ఇచ్చిన ట్విస్ట్‌ బాగున్నా అదీ కూడా ఊహించగలిగేదే ఇవ్వడంతో సినిమాలో పెద్దగా ఆసక్తికర అంశాలు ఏవీ లేనట్టే.

నటీనటులు:

అను పాత్రలో అనసూయ నటనాపరంగా ఆకట్టుకున్నా బొద్దుగా ఉండే  శరీరంతో లీడ్ రోల్ ఎబ్బెట్టుగా అనిపించింది. లీడ్ రోల్ చేసినా ఫర్వాలేదు కానీ ఆమె చేత ఫైట్స్ చేయించడమే కాస్త ఓవర్ అనిపించింది. కానీ నటనాపరంగా ఆమెకు ఎక్కడా వంక పెట్టేలేము. అసిస్టెంట్ డైరెక్టర్‌ పాత్రలో ఒదిగిపోయి నటింహిన అనసూయ అరవిందమ్మ అనే అరుంధతి టైప్ క్యారెక్టర్ లో మాత్రం మెప్పించలేకపోయారు. ఇలాంటి పాత్రల్లో అనుష్క లాంటి వారిని చూసిన ప్రేక్షకులు అనసూయను జీర్ణించుకోలేరు. అనసూయ స్నేహితుడిగా ధన్‌రాజ్, ఐపీఎస్ గా రణధీర్, అవసరాల శ్రీనివాస్, ‘పెళ్లి’ పృథ్వీ, జ్యోతి, సమీర్ తదితరులు తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు.  

టెక్నికల్ టీం:

సినిమా నాణ్యత విషయంలో నిర్మాతలు ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. రీ రికార్డింగ్ విషయంలో డబ్బింగ్‌ విషయంలో కూడా అక్కడక్కడా తేడాలు అర్ధమై పోతాయి. నిర్మాతలు కొత్తవారు కావడంతో నిర్మాణ విలువలు సరిగా పాటించలేకపోయారు. నేపథ్య సంగీతం బాగానే ఉన్నా అవసరం లేని చోట కూడా ఇరికించి ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేశారు. 

ఫైనల్ గా : కధనం సినిమా కధనం బాగుండి ఉంటే హిట్టయ్యేదేమో ?

రేటింగ్ : 2 / 5

More Related Stories