English   

నేషనల్ అవార్డ్స్ సాదించిన తెలుగు సినిమాలు ఇవే !

Mahanati
2019-08-09 18:19:36

ఈరోజు 66వ నేషనల్ అవార్డుల ప్రకటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవార్డులలో తెలుగు సినిమాలు కూడా సత్తా చాటాయి. ఈ సారి ఈ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమాలు రంగస్థలం, మహానటి, ఆ సినిమాలకి పలు విభాగాల్లో అవార్డులు వచ్చాయి, ఇక బాలీవుడ్ సినిమా తెరకెక్కించిన తెలుగు వ్యక్తికి కూడా అవార్డు దక్కింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగు నుండి మహానటి అవార్డ్ సాధించగా అదే సినిమా నుండి ఉత్తమ నటిగా ఆ సినిమా హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ కే దక్కింది. ఇక అదే సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ పని చేసిన వారికి కూడా అవార్డు వరించింది. ఇక సౌండ్ మిక్సింగ్‌ బెస్ట్ మిక్సడ్ ట్రాక్ విభాగానికి కూడా రంగస్థలం జాతీయ అవార్డ్ అందుకుంది. అంతేకాక నాని నిర్మాతగా నిర్మించిన ఆ.. సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు వచ్చింది. ఇదే విభాగంలో కేజియఫ్ సినిమాకు కూడా జాతీయ అవార్డ్ లభించింది. బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఉరి సినిమాకు వచ్చింది. సైరట్ సినిమా కెమెరామెన్, తెలుగువాడయిన సుధాకర్ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహించిన ‘నాల్’ మూవీకి ఆయనకీ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా అవార్డ్ వచ్చింది.  

More Related Stories