English   

మరో బిడ్డకి తండ్రయిన మంచు విష్ణు

vishnu
2019-08-09 19:25:07

టాలీవుడ్ హీరో మంచు విష్ణు మరో సారి తండ్రి అయ్యాడు. విష్ణు - విరానికా దంపతులకు మరో సారి అమ్మాయి జన్మించింది. విష్ణు, విరోనికా దంపతులకు తొలి కాన్పులో కవల ఆడపిల్లలు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గతేడాది జవరి రెండవ తేదీన బాబు పుట్టాడు. తన కుమార్తెలకు అరియానా, వివియానా అని పేర్లు పెట్టుకున్న విష్ణు, తనకు కొడుక్కి కూడా అవ్రామ్ అనే పేరు పెట్టారు.  తనకు మళ్లీ అమ్మాయి పుట్టిందంటూ విష్ణు ట్వీట్ చేశారు. "ఇట్స్ ఏ గాళ్, ఇట్స్ ఏ గాళ్" అంటూ లవ్ సింబల్స్ తో తన ఆనందాన్ని పంచుకున్నారు. నిజానికి నిన్ననే తన భార్య ప్రసవాన్ని ఇన్స్టా  గ్రామ్ లైవ్ ఇవ్వాలని ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే అంట టైం ఇవ్వకుండానే ఆయన భార్య మరో బిడ్డను ప్రసవించేసింది. ఇక ఈరోజు శ్రావణ శుక్రవారం, అదీ కాక వరలక్ష్మీ వ్రతం నాడు అమ్మాయి పుట్టడంతో మంచు వారింట ఆనందం వెల్లివిరుస్తోంది. ఇక సినీ ప్రముఖులు విష్ణుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విష్ణు భార్య విరోనిక జగన్ కి సోదరి అవుతారు. జగన్ చిన్నాన్న కూతురే ఆమె. అయితే కెరీర్ పరంగా విష్ణుకు అస్సలు కలిసి రావడం లేదు మంచు విష్ణు ఇటీవల ఓటర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలు ఆ సినిమా ఒకటి వచ్చిందని క్కూడా జనానికి తెలీకుండానే థియేటర్ల నుండి వెళ్ళిపోయింది.

More Related Stories