English   

వాల్మీకి నుండి టీజర్ సర్ప్రైజ్ ?

valmiki
2019-08-09 20:00:43

మెగా హీరో వరుణ్ తేజ్ లీడ్ రోల్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ హిట్ చిత్రం జిగర్తాండకు తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పెట్టా ఫేం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన జిగార్తాండ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ కాగా ఆ సినిమాని తెలుగులో వాల్మీకి పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండగా, సినిమా రచయిత పాత్రలో తమిళ నటుడు అధర్వ మురళి నటిస్తున్నాడు. ఇక వరుణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతోంది. అనుకున్న సమయానికి వచ్చేట్టయితే ఇంకా నెల రోజులే ఉంది రిలీజ్ కి. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టాలని యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే ఒక టీజర్ రిలీజ్ చేయబోతున్నారట. నిజానికి ఈ సినిమాలో తేజ్ ఎంత కన్నింగ్ లుక్ లో ఉన్నాడనే విషయాన్ని ప్రీ-టీజర్‌తో రివీల్ చేశారు. ఇక తాజాగా టీజర్‌ ను రెడీ చేస్తున్నారని సమాచారం.14రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ కూడా చివరి అంకానికి చేరుకుందని, మరో 10-15 రోజుల్లో షూటింగ్‌  మొత్తం పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టేస్తారని సమాచారం. చూడాలి మరి టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ?

 

More Related Stories