English   

నేషనల్ అవార్డుల్లో తెలుగు సినిమా జోరు...ప్రశంసల వెల్లువ 

 National Awards Winners
2019-08-10 08:03:47

ప్రతిష్టాత్మక నేషనల్ ఫిలిం అవార్డుల్లో ఈసారి తెలుగు చిత్రాలు రికార్డు స్థాయిలో అవార్డులు పొందాయి. ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. టాలీవుడ్ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి.ల.సౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. అయితే తెలుగు సినిమాలకు ఈ స్థాయిలో అవార్డులు రావడం పట్ల టాలీవుడ్ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తూ విజేతలకు తమ తమ అభినందనలు తెలుపుతున్నారు. మ‌హాన‌టి, రంగ‌స్థలం సినిమాలకి జాతీయ అవార్డులు వ‌స్తాయ‌ని ఆ సినిమాల విడుదలకు ముందే చెప్పిన చిరంజీవి అదే విషయాన్ని గుర్తు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా విజేతలకు అభినందనలు తెలుపుతూ జనసేన తరపున ప్రకటనను విడుదల చేశారు. అవార్డులు పొందిన వారికి అభినందనలు తెలుపుతూనే, ఈ స్ఫూర్తితో తెలుగులో మరిన్ని మంచి చిత్రాలు రావాలని పవన్ పేర్కొన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ షూట్ లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా విజేతలకు అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా ఒక రేంజ్ లో ప్రయాణిస్తోంది. జాతీయ అవార్డులు గెలుచుకున్న మహానటి, రంగస్థలం, ఆ!, చి.ల.సౌ చిత్ర బృందాలకు అభినందనలు’’ అని ట్వీట్ చేశారు. ఇక జక్కన్న కూడా పలు విభాగాల్లో తెలుగు సినిమాలు జాతీయ అవార్డులు గెలుచుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందని ట్వీట్ చేశారు. అలాగే హీరో, అ సినిమా నిర్మాత నాని స్పందిస్తూ.. ‘‘వాల్ పోస్టర్ సినిమా టీమ్ నేడు చాలా గర్వపడుతోంది. మా మొదటి సినిమాకే రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇంత కన్నా ఇంకా మేమేం అడగగలం. మా కాస్ట్ అండ్ క్రూ మొత్తానికి కృతజ్ఞతలు. థాంక్యూ జూరీ. అవార్డులు గెలుచుకున్న విజేతలకు అభినందనలు’’ అని నాని ట్వీట్ చేశారు. మొత్తానికి ఈ అవార్డుల ప్రకటన తర్వాత టాలీవుడ్ లో సరికొత్త జోష్ నెలకొంది.

More Related Stories