English   

ఎవరు సెన్సార్ టాక్ !

Evaru
2019-08-10 09:20:42

చేసేది తక్కువ సినిమాలే అయినా చేసేవన్నీ విభిన్న సినిమాలు కావడంతో తెలుగులో అడివి శేష్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక వరుస విజయాలను అందుకుంటోన్న అడవి శేష్ నటించిన తాజా మూవీ ఎవరు ? సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎవరు సినిమా చూసిన సెన్సార్ టీమ్ సినిమాకి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాలో ప్రేక్షకులను ఉత్కంఠతకు గురిచేసే ఎన్నో థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయని, సినిమా తప్పకుండా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యుల స్పందనగా చెబుతున్నారు. తాజాగా  విడుదలైన ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచుతోంది. వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో, పివిపి సినిమా బ్యానర్‌పై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ లో రెజీనాని ఒక వ్యక్తి రేప్ చేయబోవడం, ఓ మర్డర్ కేసుని  సాల్వ్ చెయ్యడానికి వచ్చిన కరెప్టెడ్ కాప్‌.. విక్రమ్ వాసుదేవ్‌గా శేష్ ఇంటిలిజెంట్‌గా కేసు డీల్ చేసే విధానం ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇదివరకు రిలీజయిన టీజర్, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

More Related Stories