English   

బాలీవుడ్ ఖాన్స్ డామినేషన్....ప్రభాస్ ఏమన్నాడంటే ?

 Saaho
2019-08-12 08:31:23

తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తం చేసింది బాహుబలి సినిమా. ఆ సినిమా తర్వాత హీరో ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో’ ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా అదే స్థాయిలో విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన సాహో మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజగా ఈ సినిమా యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. హైదరాబాద్ లో తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో ప్రభాస్, శ్రద్ధా కపూర్, దర్శకుడు సుజిత్, నిర్మాత ప్రమోద్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాహో’ గురించి కొందరు సినీ రిపోర్టర్స్ పలు ప్రశ్నలు అడిగారు. అందులో ఒక ప్రశ్న కి హైలైట్ సమాధానం చెప్పాడు ప్రభాస్, ఆ ప్రశ్న ఏంటంటే బాలీవుడ్ ఖాన్స్ త్రయం (షారూక్, అమీర్, సల్మాన్) సినిమాలను డామినేట్ చేసేలా సాహో సినిమా ఉండబోతోందా? అని ఒకరు ప్రశ్న వేశారు. నిజానికి ఇదే ప్రశ్న మొన్న ముంబైలో వేస్తే ప్రభాస్ దాటవేసి తప్పించుకున్నాడు. ఇక హైదరాబాద్ లో కాబట్టి చెప్పక తప్పింది కాదు. ఆయన ఏమన్నాడంటే మీరు చెప్పే ఖాన్స్ దేశ వ్యాప్తంగా మనందరినీ ఇన్‌స్పైర్ చేశారని, చాలా సినిమాలకు వాళ్లే స్ఫూర్తి అని వాళ్లను మనమే కాదు ఎవరూ ఏమీ అనకూడదు. అలా అనడం తప్పని అన్నారు. బాలీవుడ్‌లో తెలుగు స్టార్ ని అయిన నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని, అక్కడి ప్రెస్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుందని అన్నారు. అంత బాగా నన్ను రిసీవ్ చేసుకున్న వారందరికీ నేను నిజానికి కృతజ్ఞతలు తెలపాలని కూడా ప్రభాస్ చెప్పుకొచ్చారు. 

More Related Stories