English   

సాహోలో తన పాత్ర మీద ప్రభాస్ క్లారిటీ !

Prabhas
2019-08-12 08:44:02

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా రన్ రాజా రన్ ఫేం సుజీత్‌ సింగ్ దర్శకత్వం వహించిన సినిమా సాహో. శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటించిన ఈ సినిమా మీ భారీ అంచనాలు ఉన్నాయి. పలు భాషలకు చెందిన స్టార్ క్యాస్టింగ్ ఉన్న నేపధ్యంలో ఈ సినిమాని నాలుగు బాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రభాస్, శ్రద్దాలు విలేఖరులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని ట్రైలర్ లో హింట్ ఇచ్చిన నేపధ్యంలో అదే ప్రశ్న అడిగారు విలేఖరులు, ఈ సినిమాలో ఆయన పాత్ర గురించి ప్రభాస్ చెప్పీ చెప్పనట్టుగా క్లారిటీ ఇచ్చారు. సాహో పూర్తిగా స్క్రీన్‌ప్లేపై ఆధారపడి నడిచే సినిమా అని, సినిమా నడిచే విధానం రకరకాలుగా ఉంటుందన్నారు. ‘బాహుబలి’ కధ బేస్డ్ సినిమా కాబట్టి, ఆ తర్వాత స్క్రిప్ట్‌ బేస్డ్ సినిమా చేయాలని ఇది ప్లాన్ చేసినట్టు చెప్పుకోచ్చారు. అలాగే బాహుబలి ఒత్తిడి ఈ సినిమాకి పని చేసిన అందరిపైనా ఉందని, అయితే దర్శకుడు సుజీత్ మాత్రం ఆ ప్రెజర్ ఫీలవ్వలేదని ప్రభాస్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పనిచేశారని అయినప్పటికీ వాళ్లందరినీ సుజీత్ చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పుకొచ్చాడు ప్రభాస్.  

More Related Stories