English   

కేజీఎఫ్ రికార్డులను బద్దలు కొట్టిన కన్నడ సినిమా 

Kurukshetram 3D
2019-08-12 09:35:34

కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన కే.జి.ఎఫ్ సినిమా గతేడాది డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విదులయ్యింది. మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లో రికార్డు కలెక్షన్లను సాధించింది. బంగారు గనుల మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ మునుపెన్నడూ లేని విధంగా కన్నడ వర్షన్ లో తొలిరోజు రూ.12.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ రికార్డులని మరో సినిమా బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. కన్నడ స్టార్ హీరో దర్శన్ దుర్యోధనుడుగా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కర్ణుడిగా నటించిన కురుక్షేత్రం మొన్న శుక్రవారం నాడు విడుదలైంది. కన్నడలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా అనువాదం చేసి విడుదల చేశారు. మొత్తం నాలుగు దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేశారు. త్రీడీ టెక్నాలజీలో మొట్టమొదటిసారిగా ఈ సినిమా మీద జనాలు బాగానే ఇంటరెస్ట్ చూపించారు. అదీ కాక శుక్రవారం తెల్లవారుజాము నుంచే కర్ణాటకలో ‘కురుక్షేత్రం’ బెనిఫిట్ షోలు మొదలయ్యాయి. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో ఎక్కువ షోలు వేశారు. అలా ఈ సినిమా కె.జి.ఎఫ్ ని దాటగలిగిందని అంటున్నారు. ఇంకా ఈ సినిమాలో సోనూసూద్ అర్జునుడిగా, అభిమ‌న్యుడిగా నిఖిల్ గౌడ, కృష్ణుడిగా ర‌విచంద్రన్, శకునిగా రవిశంకర్, ద్రౌప‌దిగా స్నేహ న‌టించింది. తెలుగు, క‌న్నడ భాష‌ల్లో ఎన్నో సినిమాలు నిర్మించిన రాక్‌ లైన్‌ వెంక‌టేష్‌ స‌మ‌ర్పణ‌లో, వృష‌భాద్రి ప్రొడ‌క్షన్స్ బ్యానర్ మీద ఎమ్మెల్యే మునిర‌త్న ఈ సినిమాను నిర్మించారు. నాగ‌న్న ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ సినిమా లాంగ్ రన్ లో మాత్రం కలెక్షన్స్ రాబట్టడం కష్టమే అని అంటున్నారు.

More Related Stories