English   

ఇస్మార్ట్ కాంబినేషన్ కుదిరిందిగా.. విజయ్ దేవరకొండతో పూరీ..

Vijay Deverakonda
2019-08-12 19:50:42

ఒక్క హిట్ కొట్టగానే పూరీ ఫామ్ లోకి వచ్చేసాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు పూరీ జగన్నాథ్. ఈ చిత్రం దాదాపు 40 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఐదేళ్ల తర్వాత పూరీ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఇది. ఇక ఇప్పుడు ఇదే ఊపులో విజయ్ దేవరకొండతో సినిమా అనౌన్స్ చేసాడు పూరీ. అదే ఇస్మార్ట్ శంకర్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది. ఛార్మి కనెక్ట్స్ తో కనెక్ట్ అయిపోయి పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రం జనగణమన అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. కానీ ఇంత భారీ స్క్రిప్ట్ విజయ్ మోస్తాడా అనేది కూడా ఆసక్తికరంగా మారిందిప్పుడు. మనోడికి ఉన్న ఇమేజ్ కు జనగణమన లాంటి సబ్జెక్ట్ కష్టమే. కానీ అక్కడున్నది పూరీ జగన్నాథ్. ఏ క్షణంలో ఏదైనా చేస్తాడు.. చేసి చూపిస్తాడు కూడా. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా కూడా ఇలాగే ప్లాన్ చేస్తున్నాడు ఈయన. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అన్నీ కుదిర్తే ఇదే ఏడాది సినిమా విడుదల చేయాలని చూస్తున్నాడు పూరీ. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమాతో బిజీగా ఉన్నాడు విజయ్. ఈ చిత్రం తర్వాత కొత్త దర్శకుడితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే దానికంటే ముందు పూరీ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది. మరి చూడాలిక.. ఈ క్రేజీ కాంబినేషన్ లో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందో..?

More Related Stories