English   

ఆ సినిమా రిలీజ్ కాకుండానే...మరో సీక్వెల్ ప్లాన్ చేసిన కుర్ర హీరో !

 Nikhil
2019-08-13 14:01:28

ఒకప్పుడు వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన కుర్ర హీరో నిఖిల్ కి ఇప్పుడు అస్సలు కాలం కలిసి రావడం లేదు. సినిమాలు పూర్తి అయినా అవి రిలీజ్ కాక అసలు అవుతాయో లేదో తెలీక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. కిరాక్‌ పార్టీ సినిమా తరువాత చాలా లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న నిఖిల్‌ అర్జున్‌ సురవరం సినిమాతో పాటు మరో సినిమా కూడా షూట్ సహా అన్ని పనులూ పూర్తి చేసుకున్నా రిలీజ్ విషయం తేలకపోవడంతో మనోడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. కిర్రాక్ పార్టీ సినిమా తర్వాత ముద్ర అనే సినిమా ప్లాన్ చేశాడు. 

ఇదే పేరుతో మరో సినిమా రావడంతో వివాదమైంది. మొత్తం మీద టైటిల్‌ను మార్చి ‘అర్జున్ సురవరం’గా విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఆ తేదీకి సినిమా విడుదల కాలేదు. అదే టైమ్‌లో ‘అవెంజర్స్’ విడుదలవుతుండటంతో వెనక్కి తగ్గారని అనుకున్నా నిజానికి ఏవో ఆర్దిక ఇబ్బందులని తర్వాత తేలింది. అయితే ఈ సినిమా సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు నిఖిల్ మరో సినిమా మీద ద్రుష్టి పెట్టినట్టు చెబుతున్నారు. నిఖిల్ హీరోగా గతంలో వచ్చిన కార్తికేయ మంచి హిట్ గా నిలిచింది. దర్శకుడిగా ఈ సినిమా చందూ మొండేటికి కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. 

ఈ క్రమంలో ఆయన 'కార్తికేయ'కి సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేసినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ నిఖిల్ హీరోగా 'కార్తికేయ 2'ని మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్టు వర్కు పూర్తి కాగా అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పీపుల్స్ మీడియా ఫాక్టరీ బ్యానర్ మేద విశ్వప్రసాద్, వివేక్ కూచి భొట్ల ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం. 
 

More Related Stories