English   

వాల్మీకి టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్....భయపెడుతున్నాడుగా !

Valmiki Teaser
2019-08-13 14:26:02

మెగా హీరో వరుణ్ తేజ్  కధా నాయకుడిగా డైరెక్టర్ హరీష్ శంకర్ వాల్మీకి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో రిలీజయ్యి సూపర్ హిట్ గా నిలిచిన జిగర్తాండ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. రజనీతో పెట్టా వంటి బ్లాక్ బస్టర్ అందించిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన జిగార్తాండ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా చూసిన వారంతా ఈ సినిమా కూడా బాగుంటుందనే అంచనాలోనే ఉన్నారు. ఆ అంచనాలను నిజం చేస్తూనే వరుణ్ తేజ్ లుక్ కూడా ఉంది. మునుపెన్నడూ చూడని లుక్ లో భయంకరంగా కనిపిస్తున్నాడు వరుణ్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తుండగా, సినిమా రచయిత పాత్రలో తమిళ నటుడు అధర్వ మురళి నటిస్తున్నారు. 

ఇక వరుణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతోంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే ఒక టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ కావాడానికి సరిగ్గా నెల రోజులు ఉన్న నేపధ్యంలో మరో రెండ్రోజుల్లో టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది ఈ సినిమా యూనిట్. ఆ టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్ లో కూడా వరుణ్ భయపెడుతున్నాడు. బ్రహ్మకి మూడు తలలు ఉన్నట్టు ఐదు మొహాలతో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. 14రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోతుండగా అదే రోజున నాని గ్యాంగ్ లీడర్ కూడా రిలీజ్ అవుతోంది. చూడాలి ఈ రెండు సినిమాల్లో ఎవరి బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తారో ?

More Related Stories