English   

చిరంజీవి ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్.. సైరా మేకింగ్ వీడియో రెడీ.. 

Sye Raa
2019-08-13 17:34:34

చిరంజీవి ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వేచి చూస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రం కోసం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు మెగాభిమానులు. సాధారణ ప్రేక్షకులు సైతం సైరా కోసం చూస్తున్నారు. బాహుబలి తర్వాత ఆ స్థాయి సినిమా అవుతుందనే అంచనాలు కూడా సైరాపై ఉన్నాయి. సురేందర్ రెడ్డి దీన్ని అదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు కూడా. హాలీవుడ్ టెక్నికల్ టీంతో కలిసి సైరాను రూపొందిస్తున్నాడు ఈయన. ఇక ఇప్పుడు ఈయన చిత్రీకరించిన దాంట్లో కాస్త ప్రేక్షకులకు కూడా చూపించే సమయం వచ్చేసింది. సైరా మేకింగ్ వీడియో విడుదల చేస్తున్నారు చిత్రయూనిట్. స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత చరిత్ర కావడంతో పంద్రాగస్ట్ కు ఒక్కరోజు ముందు అంటే ఆగస్ట్ 14వ తేదీ సాయంత్రం 3.45 నిమిషాలకు సైరా మేకింగ్ వీడియో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు పోస్టర్ కూడా వచ్చేసింది. చిరంజీవి రాజసంగా నడుస్తున్న స్టిల్ పిచ్చెక్కిస్తుంది. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా ప్లాన్స్ చేస్తున్నాడు. చిరంజీవి కూడా సైరా కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాడు. ముఖ్యంగా భారీ బడ్జెట్ పెట్టడంతో ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నాడు మెగాస్టార్. అక్టోబర్ 2న విడుదల కానుంది ఈ చిత్రం. ఇందులో నయనతార, తమన్నా, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. మేకింగ్ వీడియో అదిరిపోయిందంటే అంచనాలు కూడా మరింతగా పెరిగిపోవడం ఖాయం.

More Related Stories