English   

రెజీనా కెరీర్ ను కాపాడేది ఎవరు 

Regina Cassandra
2019-08-13 18:26:56

తనతో పాటు వచ్చిన వాళ్లంతా స్టార్ హీరోయిన్లు అయిపోతుంటే.. తాను మాత్రం ఎక్కడ మొదలుపెట్టిందో అక్కడే ఆగిపోయింది రెజీనా. అందాల ఆరబోతకు ఎంతగా ముందుకొచ్చినా కూడా దర్శక నిర్మాతలు మాత్రం ఈమెపై ఎప్పుడూ శీత కన్నే వేసారు. ఇప్పటి వరకు స్టార్ హీరోలెవరూ రెజీనాకు అవకాశాలు ఇవ్వలేదు. వచ్చిన ఒకట్రెండు సినిమాలు కూడా ఆడలేదు. దాంతో ఇప్పుడు ఈమె ఆశలన్నీ ఎవరు సినిమాపైనే ఉన్నాయి. ప్రస్తుతం ఎవరు సినిమాలో నటిస్తుంది రెజీనా. ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఈ సినిమాలో కాస్త బోల్డ్ రోల్ చేసింది రెజీనా. ఇందులో రేప్ కు గురయ్యే అమ్మాయిగా నటించింది రెజీనా. ఈ నేపథ్యం చుట్టూనే కథ అల్లాడు దర్శకుడు వెంకట్ రాంజీ. ఈ రోజుకు కూడా రెజీనా స్టార్ అవ్వాల‌ని ఆరాట‌ప‌డుతూనే ఉంది కానీ కాలేదు.. కావ‌ట్లేదు.. అవుతుందో లేదో క్లారిటీ లేదు. అందం ఉంది.. అభిన‌యం ఉంది కానీ అదృష్ట‌మే లేక అక్క‌డే ఆగిపోయింది రెజీనా. ఈ సినిమా ఆడితేనే రెజీనా ఉందని ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలకు కూడా గుర్తుంటుంది. లేదంటే మాత్రం కచ్చితంగా ఈమె కెరీర్ మరింత డౌన్ ఫాల్ లోకి వెళ్లిపోవడం ఖాయం.

More Related Stories