English   

కొత్త దర్శకుడి కధకి ఓకే చెప్పిన తేజూ ?

 sai dharam tej
2019-08-13 18:57:55

వరుస పరాజయాల తరువాత చిత్రలహరి సినిమా హిట్ కొట్టడంతో రిలాక్స్ అయిన సాయి ధరమ్ తేజ్ అదే జోష్ తో యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ మధ్యనే సెట్స్ మీదకి వెళ్ళింది. తూర్పు గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూళ్ళో కాస్త షూట్ కూడా జరుపుకుంది. ఈ సినిమాకు ముందుగా భోగి అనే టైటిల్‌ను పరిశీలించినా చివరికి 'ప్రతిరోజు పండగే' అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో తేజ్ ఇంతకుముందు చేసిన సినిమాల్లో కన్నా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ జోడీగా జోడిగా రాశిఖన్నా నటిస్తోంస్తుంది. వీరిద్దరు కలిసి నటించడం ఇది రెండో సారి. 

ఇంతకుముందు వీరిద్దరి కలయికలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన సుప్రీమ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే తేజూ మరో సినిమా ఒప్పుకున్నాడని చెబుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం తేజూ ఓ కొత్త డైరెక్టర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఉయ్యాల జంపాల -మజ్ను సినిమాల దర్శకుడు విరించి వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన సుబ్బు  అనే దర్శకుడు చెప్పిన కధకి తేజ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. సుబ్బ చెప్పిన కథ తనకు బాగా నచ్చడంతో దానిని స్క్రిప్ట్ రాసుకుని రమ్మని పురమాయించాడట తేజూ. బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారని చెబుతున్నారు.  ఈ సినిమా మీద త్వరలో ప్రకటన కూడా చేయనున్నారని సమాచారం. 
 

More Related Stories