English   

నాగ శౌర్యకు ట్రాఫిక్ పోలీసుల షాక్.. ఫైన్ వేసిన ఇన్స్‌పెక్టర్..

Naga Shourya
2019-08-13 20:50:58

వరస సినిమాలతో దూసుకుపోతున్న నాగ శౌర్యకు సూపర్ షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. రూల్స్ పట్టించుకోనందుకు కారు ఆపి ఫైన్ వేసారు. పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ ఇది చేసి చూపించాడు. ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోనందుకు ఆయన కారు ఆపారు పోలీసులు. తప్పు ఒప్పుకోవడంతో పాటు మరోసారి అలా జరగకుండా జాగ్రత్త పడతానని చెప్పాడు ఈ కుర్ర హీరో. అసలు విషయం ఏంటంటే.. నాగ శౌర్య ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. షూటింగ్స్ చేసుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఆయన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో తన కారులో ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆపారు. దానికి కారణం కారుకు ఉన్న బ్లాక్ ఫిలిం. వీటిని బ్యాన్ చేసారు.. దేశంలో జరుగుతున్న నేరాలను అరికట్టడానికి బ్లాక్ ఫిల్మ్స్ తొలగించాలనే తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. అయినా కూడా కొందరు దీన్ని అతిక్రమిస్తున్నారు. హీరో నాగ శౌర్య కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ రవి ఆయనకు 500 రూపాయల ఫైన్ వేసాడు. అతది కట్టేయడంతో పాటు అక్కడే తన కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తీయించుకున్నాడు నాగ శౌర్య. మరోసారి ఇలాంటివి జరక్కుండా చూసుకుంటానని చెప్పాడు ఈయన. ఈ మధ్యే ఓ బేబీతో హిట్ కొట్టాడు శౌర్య. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈయన.

More Related Stories