దర్శకుడు వినాయక్ పొలిటికల్ ఎంట్రీ.. నిజమెంత...?

ఏమో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఆ మధ్య రాజమండ్రిలో ఇంటిలిజెంట్ ప్రీ రిలీజ్ వేడుక జరిగిన తీరు.. అక్కడ వాళ్లు మాట్లాడిన మాటలు చూస్తుంటే వినాయక్ నిజంగానే సినిమాలు కాదని రాజకీయాల్లోకి వెళ్లిపోతాడేమో అనే అనుమానం అయితే వస్తుంది. అక్కడికి వచ్చిన వాళ్ళంతా సాయిధరంతేజ్ కంటే ఎక్కువగా వినాయక్ భజనే చేసారు. ఆయన దేవుడని.. ఊళ్లో వాళ్లందరికీ దారి చూపించాడని.. సింహం అని.. పులి అని ఇలా అంతా కలిసి వినాయక్ ను మునగచెట్టెక్కించేసారు. సప్తగిరి అయితే ఓ అడుగు ముందుకేసి వినాయక్ గారు సినిమాల్లోనే కాదు.. ఆయన ఏ రంగంలోకి వెళ్లినా ఆయన వెంటే మీరుంటారని అర్థమైందని చెప్పాడు. దాంతో వినాయక్ కూడా షాక్ అయ్యాడు. నిజానికి ఇండస్ట్రీలో చాలా రోజులుగా ఓ టాక్ వినిపిస్తుంది. వినాయక్ సినిమాలు ఇక తగ్గించేసి రాజకీయాల్లోకి వెళ్లిపోవాలనుకుంటున్నాడని..! దీనికి పెద్దగా కారణాలు కూడా లేవు. ఆ మధ్య వరసగా పరాజయాలు ఎదురవడంతో వినాయక్ లో అసహనం పెరిగింది. సినిమాలు చేయాలా వద్దా అనే డైలమాలో కూడా కొన్నాళ్లు ఉన్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే సినిమాల్లో వచ్చిన డబ్బుతో బయట బాగానే వెనకేసుకున్నాడు వినాయక్. దాంతో ఇండస్ట్రీ నుంచి పూర్తిగా సెలవు తీసుకునేందుకు వినయ్ సిద్ధమయ్యాడనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఇవి నడుస్తుండగానే ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఇంటిలిజెంట్ డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు కానీ దర్శకుడిగా మాత్రం బిజీగా లేడు. ఆది టైమ్ లో కోటి రూపాయలు వస్తే చాలనుకునేవాడు వినాయక్. అప్పట్లో వచ్చిన డబ్బుతో బిజినెస్ చేసి బాగానే సంపాదించుకున్నాడు ఈ దర్శకుడు. ఇక ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో పెద్దగా టైమ్ కలిసిరావడం లేదు. నిజం చెప్పాలంటే ఠాగూర్ తర్వాత ఆ స్థాయి బ్లాక్ బస్టర్ వినాయక్ కెరీర్లో కనబడలేదనే చెప్పాలి. సాంబ, యోగి, బద్రీనాథ్ సినిమాలు ప్లాపయ్యాయి. బన్నీ, అదుర్స్, కృష్ణ, నాయక్ సినిమాలు ఏదో కామెడీతో అలా అలా ఓకే అనిపించాయే గానీ బ్లాక్ బస్టర్స్ కాదు. ఇక అల్లుడుశీనుతో బెల్లంకొండ ఇప్పటివరకు కోలుకోలేకపోయాడు. అఖిల్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఖైదీ నెం.150 సినిమా చిరంజీవి రేంజ్ వల్ల ఆడేసింది. మొత్తానికి వినాయక్ ఆలోచనలు ఇప్పుడు ఎవరికీ అందడం లేదు. ఇక ఈ మధ్యే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాపు కార్పొరేషన్ చైర్మన్ గావైసీపీకి యువ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని నియమించాడు. దీనికి వినాయక్ హాజరు కావడం విశేషం. జగన్ ప్రసంగాలు, మాటలు తనలో స్ఫూర్తిని నింపాయని వినాయక్ చెప్పాడు. దాంతో త్వరలోనే ఈయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.