English   

భారీ ఎత్తున సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్....ఆ పోస్ట్ అర్ధం అదేనా ?

Saaho
2019-08-14 09:06:19

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. బహుబలితో ప్రభాస్ వరల్డ్ వైడ్ ఫేం సంపాదించిన నేపధ్యంలో ఈ సినిమా మీద భారీగా ఖర్చు పెట్టి తెలుగు సినిమా అనే ముద్ర పడకుండా హిందీ హీరోయిన్, తమిళ్ నుండి కొందరు నటులని అలా అన్ని బాషల వారినీ కవర్ చేశారు. ఇక రెండేళ్ళ నుండి షూట్ లో ఉన్న ఈ సినిమా మరో పదిహేడు రొజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేసే పనుల్లో ప్రస్తుతం యూనిట్ బిజీగా ఉంది, హీరో హీరోయిన్ లు ఒకరోజు ముంబైలో మరో రోజు హైదరాబాద్ లో ఈవెంట్ లు పెట్టి మరీ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీని వేదికగా చేసుకున్నారని, ఆగస్టు 18వ తేదీన ఈ వేడుక జరగనుందని అంటున్నారు. 

ఈ విషయం మీద యూనిట్ నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ తెలుగులో బిగ్గెస్ట్ ఈవెంట్ మ్యానేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక పిక్ మాత్రం అదే కన్ఫర్మ్ చేస్తోంది. ఈ సంస్థ అధినేత శ్రీనివాస్ తన ఫేస్ బుక్ లో రామోజీ ఫిలిం సిటీ దగ్గరలోని ఒక గ్రౌండ్ లో ఏవో ప్లాన్ పేపర్స్ తో తిరుగుతున్న ఫోటోలను పోస్ట్ చేసి తమ నుండి అతి పెద్ద అనౌన్స్మెంట్ రానుందని పోస్ట్ చేశారు. అయితే ఆ ప్రకటన సాహో ప్రీ రిలీజ్ గురించే అనే చర్చ మొదలయ్యింది. ఇక ఈ హైదరాబాద్‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అనంతరం చెన్నై, బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా డియర్ కామ్రేడ్ మాదిరే ప్రమోషన్ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తారని కూడా సమాచారం అందుతోంది.

More Related Stories