English   

చిరంజీవి సైరా నరసింహారెడ్డి మేకింగ్ వీడియో విడుదల..

Sye Raa Narasimha Reddy
2019-08-14 16:36:04

చిరంజీవి ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వేచి చూస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రం కోసం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు మెగాభిమానులు. సాధారణ ప్రేక్షకులు సైతం సైరా కోసం చూస్తున్నారు. బాహుబలి తర్వాత ఆ స్థాయి సినిమా అవుతుందనే అంచనాలు కూడా సైరాపై ఉన్నాయి. సురేందర్ రెడ్డి దీన్ని అదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు కూడా. హాలీవుడ్ టెక్నికల్ టీంతో కలిసి సైరాను రూపొందిస్తున్నాడు ఈయన. ఇక ఇప్పుడు ఈయన చిత్రీకరించిన దాంట్లో కాస్త ప్రేక్షకులకు కూడా చూపించే సమయం వచ్చేసింది. సైరా మేకింగ్ వీడియో విడుదల చేసారు. స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత చరిత్ర కావడంతో పంద్రాగస్ట్ కు ఒక్కరోజు ముందు అంటే ఆగస్ట్ 14వ తేదీ సాయంత్రం 3.45 నిమిషాలకు సైరా మేకింగ్ వీడియో విడుదలైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. రిలీజ్ అయిన క్షణం నుంచి సైరా మేకింగ్ వీడియో రప్ఫాడిస్తుంది. ముఖ్యంగా మేకింగ్ విషయంలో సురేందర్ రెడ్డి అదరగొట్టాడు. హై రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ తో సైరాను అత్యున్నతంగా తెరకెక్కిస్తున్నాడు సురేందర్ రెడ్డి. చిరంజీవితో పాటు నయనతార, తమన్నా, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్ లుక్స్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఆగస్ట్ 20న టీజర్ విడుదల కానుంది.
 

More Related Stories